YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

రైతు సంఘటితమే సంపదకు ఆయుపట్టు.

Highlights

  •  రైతు వేదికకు రూ.12లక్షలు మంజూరు
  • బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయింపు
  • కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం 
  • మండలానికి ఎమ్మార్వోనే రిజిస్ట్రార్‌
  • రైతు సదస్సులో సీఎం కేసీఆర్ 
రైతు సంఘటితమే సంపదకు ఆయుపట్టు.

 రైతులను సంఘటితం చేయడమే సృష్టించబోయే సంపదకు ఆయుపట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఈ దిశగా రైతులకు ఏం కావాలన్నా సమకూరుస్తామని చెప్పారు. ఆదివారం ప్రారంభించిన రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సులో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు వ్యవసాయ రంగంపై పలు సూచనలు, సలహాలిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.వచ్చే బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు రైతుల పెట్టుబడి కోసం కేటాయించబోతున్నామని చెప్పారు.  రైతులు పండించే విలువ రూ.లక్షా 25వేల కోట్లు ఉండబోతోందన్నారు. ఏ ఎకరంలో ఏ పంట పండుతుందో సమన్వయ సమితికి తెలియాలి. ప్రస్తుతం ఉన్న  141 సబ్ రిజిస్ట్రార్‌లు అలాగా ఉంటారు. ఎమ్మార్వోలు కూడా సబ్ రిజిస్ట్రార్‌లుగా ఉంటారు. ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్ట్రార్‌గా ఉంటారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ గురించి లంచాలు ఇచ్చుడు బంద్. పాస్ బుక్ ఇవ్వడంలో సబ్ రిజిస్ట్రార్ ఆలస్యం చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫైన్ విధిస్తం. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందుబాటులో ఉంటుంది. పాస్ పోర్టు వచ్చినట్టే పాస్ బుక్కులు కూడా పోస్టులో ఇంటికి వస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోటి 65 లక్షల ఎకరాల వ్యవసాయ నికర భూమి తేలిందన్నారు. కోటి 32 లక్షల భూమి ఏ పంచాయతీ లేకుండా ఉన్నదని... రైతులను ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా విజయాలు సాధిస్తామని చెప్పారు. రైతులు వ్యవస్థీకృతమే పంట కాలనీలు కూడా సాధ్యమేనన్నారు. ప్రతి రైతు వేదికకు రూ.12లక్షలు మంజూరు చేస్తానన్నారు. ప్రతి రైతు వేదిక 5 వేల ఎకరాల పంట లెక్క తీయాల్సి ఉందన్నారు. కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపామని పేర్కొంటూ.. సమన్వయ సమితి సరిగా ఉంటే కల్తీ చీడ పురుగులుండవని స్పష్టం చేశారు. రైతులకు కరెంట్, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అన్ని ఆంద్రస్తున్నామని చెప్పారు. ఆంధ్రా పాలకుల హయంలో మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైందన్నారు. మిషన్ కాకతీయకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు.

Related Posts