YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

సైబర్‌ దాడులకు పాల్పడిన రష్యా 

Highlights

  • ఐవోసీపై ప్రతీకారం తీర్చుకునేందుకు
  • ముగిసిన  వింటర్‌ ఒలంపిక్స్‌
సైబర్‌ దాడులకు పాల్పడిన రష్యా 

అమెరికా ధ్వజం  దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తుంది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌ వేదికగా వింటర్‌ ఒలంపిక్స్‌ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ క్రీడా సమరం ఆదివారంతో  ముగియనుంది. అయితే రష్యన్‌ మిలిటరీ గూఢాచారులు ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించారంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రారంభ వేడుకల సందర్భంగా సైబర్‌ దాడులు జరిగినట్లు నిర్వాహకులు ప్రకటించారు.డోపింగ్‌ ఆరోపణల కారణంగా రష్యన్‌ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతో రష్యా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు హాజరుకాలేకపోయారు. కానీ, అది రష్యా పనేనా అన్న విషయం మాత్రం వాళ్లు ధృవీకరించలేదు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనన్న అనుమానాలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో  ఈ ముగింపు వేడుకలకు కూడా రష్యా అంతరాయం కలిగించే ఆస్కారం ఉందన్న ఆరోపణలతో దగ్గరుండి పర్యవేక్షించబోతున్నట్లు అమెరికా ప్రకటించగా.. అందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. కానీ రష్యా మాత్రం అమెరికా ప్రకటనను ఖండించింది..

Related Posts