YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

మిల్లెట్స్ తో ఆరోగ్యము పదిలం

Highlights

  • సిరి ధాన్య మిల్లెట్లు ఎందుకు తినాలి ??
  • జీవితం లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి
 మిల్లెట్స్ తో ఆరోగ్యము పదిలం

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యా(మిల్లెట్) లు !
ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !!

మీకు తెలుసా పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2 -3 ఫైబర్ టాబ్లెట్ లను నీటి లో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు, సహజం గా ఆహారంలోనే ఇమిడి ఫైబర్ ఉండటం మాత్రమే రక్తం లోకి గ్లూకోజు విడుదల ని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. 

(ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు, డాక్టర్ ఖాదర్ అవిరామ కృషి ద్వారా, మన ముందు తరాలు ఆహారం గా తిన్న ఈ అద్భుత ఆహార ధాన్యాలు - 'సిరి ధాన్యాలు' తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఈ నాటి ఆధునిక రోగాల నివారణ, నిర్మూలన లలో కూడా ఈ 'సిరి ధాన్యాలు' ఎలా పాత్ర వహిస్తాయో డాక్టర్ ఖాదర్ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇది మన కూ, మన ముందు తరాల వారికీ, మన భూములకూ, మన వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకం కానున్నాయి ఈ సిరి ధాన్యాలు.) 

సిరి ధాన్య మిల్లెట్లు ఎందుకు తినాలి- అన్న విషయాన్ని శాస్త్రీయం గా , క్లుప్తం గా తెలుసుకుందాం...
ఈ నాటి వరి అన్నం, గోధుమల లో ఎన్నో మార్పులు జరిగాయి. తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్ధం అంటే ఫైబర్ కూడా తక్కువయి పోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరువయ్యాయి. వాటికి తోడు విష పూరిత మైన కలుపు మందుల వాడకం కూడా పెరిగి పోయింది. మన ఆహారం లో ఉన్న సహజ పీచు పదార్థమే (డైటరీ, ఫైబర్) మన ఆహారం నుండి గ్లూకోస్ విడుదల రక్తం లోకి జరగడాన్ని నియంత్రిస్తుంది. ఒకే సారి గా అధిక మొత్తం లో గ్లూకోజు ను విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో దీర్ఘ కాలం పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యం లో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.
ఈనాడు వరి, గోధుమ ఆహార పదార్థా లలో పీచు పదార్థం ౦.25 శాతం- ౦.5% కి చేరి పోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోస్ గా (చక్కర గా- అంటే జీర్ణ మైన ఆహారానికి చివరి స్థితి గా ) మారి పోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోస్ (చక్కర) గా 'ఒక్కసారిగా' రక్తం లోకి వచ్చి చేరుతోంది.ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే ? వీటికి తోడు గా స్వీట్లు తింటే?,   బిస్కెట్స్ లో, బర్గర్, పిజ్జా లో, మైదా తో చేసిన నాను రొట్టె లో కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తం లోకి చేరుకొని చేటు చేస్తుంది, క్రొవ్వు పెంచుతుంది, చక్కర వ్యాధి ఉన్నవాళ్ళ ని కష్ట పెడ్తుంది, అనేక రోగాలకూ దారి తీస్తుంది. మైదా తో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోస్ గా మారి రక్తం లో కలుస్తాయి. మైదా తయారీ లో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధి కి ఎంతో హానికరం. 
సాధారణంగా మన దేహం లోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే) లో ఉండే గ్లూకోస్ 6 నుండి 7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది అరిగి, చివరిగా గ్లూకోస్ గా మారి, రక్తం లోకి గ్లూకోస్ రావటం దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్క సరిగా 10 నిమిషాల్లో లేదా 30 -40 నిమిషాలలోఅధిక మొత్తం లో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్నవారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, పిల్స్, మొలలు, మూలశంక, ట్రై గ్లిసెరైడ్స్, అధికరక్తపీడనం అంటే బీపీ.మూత్రపిండాల రోగులు, హృద్రోగులూ వగైరా అందరికీ) మరింత చేటు. అందుకే అవి దూరం పెట్టాలి. సిరి ధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దీ గా చిన్న మొత్తాలలో గ్లూకోస్ రక్తం లోకి వదులుతాయి.


కొర్ర బియ్యం, అర్క బియ్యం, ఊదలు బియ్యం, సామెలు బియ్యం, అండు కొర్రలు బియ్యం 8 నుండి 12 శాతం పీచు పదార్థం /ఫైబర్ కలిగినవి. పూర్తిగా సేంద్రియ మైనవి. ఈ ఐదూ 'పంచ రత్న సిరి ధాన్యాలు గా' 'పాలిష్ చేయ బడనివి'. మరింత శ్రేష్ఠ మైనవి మీకు మిల్లెట్ జోన్ అందిస్తుంది.వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.

సిరిధాన్యాల విశిష్టత : 
సిరిధాన్యాల గొప్పదనం అధికంగా ఫైబర్ కలిగి ఉండటమే అని ఆనుకోవద్దు. అసలు అధికం అనే మాట ఇక్కడ సరైనది కాదు. సమతుల్యం గా, ఆహారంలోనే ఇమిడి ఉన్న సహజమైన DIETARY ఫైబర్ కలిగి ఉండటం వాటి ప్రత్యేకత. మూడు పూటలా తిన్నపుడు, ఆ రోజుకి మనిషికి అవసరమైన 25-30 గ్రాముల ఫైబర్ ఈ ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయాలనుండి, ఆకులనుండి పొందవచ్చు.(ప్రతీ మానవుడికి రోజుకి 38 గ్రాముల ఫైబర్ కావాలి.)

ఒక్కొక్క ధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, రోగనిర్మూలనశక్తినీ కలిగి ఉన్నాయి.

వరి, గోధుమలతో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండిబయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.
ఉదాహరణ కి కొర్రబియ్యం - సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్ తో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజం గా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి కొన్నేళ్లు. అవి పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన weakness, convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలు పోయేందుకూ, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్'s రోగం, ఆస్త్మ ను(అరికెల తో పాటుగా) నివారించడంలో కూడా ఇది దోహదపడుతుంది.
ఇలాగే అరికలు బియ్యం - రక్త శుద్ధి కీ, ఎముకల మజ్జ మరింత సమర్ధ వంతం గా పనిచేసేలా చూసేందుకూ, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండ, ప్రోస్స్ట్రేటు, రక్త క్యాన్సర్, ప్రేగుల, థైరాయిడ్, గొంతు , క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లకూ, లూ తగ్గించుకోవడానికి, అధికం గా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారి కి కూడా అరికలు ఏంటో మేలు చేస్తాయి. డెంగు జ్వరం, టైఫాయిడ్ జ్వరం, వైరస్ జ్వరం వగైరా ల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.


సామెలు బియ్యం - మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలం లోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడ వారి లో PCOd తగ్గించుకోవచ్చు. మగ వారి లో వీర్య కణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్ధి కి, మెదడు, గొంతు , రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంధుల క్యాన్సర్లకూ కూడా సామెలు ఎంతో పనికి వస్తాయి.
ఊదలు బియ్యం - థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కర వ్యాధి కీ మంచివి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడ్డేరు శుద్ధి కి కూడా ఇవి పని చేస్తాయి. కామెర్ల వ్యాధి కీ, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు గర్భాశయపు క్యాన్సర్ లలో కూడా పనిచేస్తాయి.
అండు కొర్రలు బియ్యం - జీర్ణ మండలం లోని కష్టాలు తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, Fissures, అల్సర్ లు, మెదడు, రక్త , స్తనాల ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ క్యాన్సర్ లు మొదలైన కష్టాలనూ పోగొట్టడం లో తమ పాత్ర అద్భుతం గా పోషిస్తాయి.
దేశంలో 7 నుండి 10 కోట్ల మందికి మధుమేహం-2 వ్యాప్తిచెందింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతలు సంఖ్య ను చెప్తారు ప్రీ-Diabetics ని కూడా చేర్చి ).వీరంతా నెల నెల మందుల పై ఎంత ఖర్చు పెడతారో ఊహించండి.
కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్ ఇంజక్షన్ ల వైపు, ఇంకా అది దాటి కిడ్నీ సంబంధ సర్జరీ లకు కొన్ని పదుల లక్షల రూపాయల ఖర్చు వైపు వెళ్లాల్సి వస్తుంది.

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు కొన్ని:
మైదా, రిఫైన్డ్ చక్కర పదార్థాల వాడకం, 
పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారం గా సేవించడం,
అధికం గా తెల్ల చక్కర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ ల సేవనం, వందల కొద్దీ రసాయనాలు వేసిన -ప్యాక్ చేసిన ఆహారాలు కొనుక్కొని తినడం, తీవ్రత తో కూడిన జీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు; emotions, వ్యాపారం లో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు క్లోమ గ్రంధి ని ఆవహించిన ఇన్ఫెక్షన్ లూ, అంటి బయాటిక్ ల విపరీతఫలితాలు ఇందుకు చెప్పుకో దగ్గ కొన్ని కారణాలు.

గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే 'మధు మేహం' మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. అది కళ్ళ కూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడు కూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది.

'మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు పది సూత్రాలు:
i) 8 నుండి 12.5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన సిరి ధాన్య (మిల్లెట్ ) ల ను ముఖ్య ఆహారం గా స్వీకరించడం. 
వరి, గోధుమలతో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది. 
కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే. 
రోజు కొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి.(అదే ధాన్యాన్ని)
ఇలా 5 ధాన్యాలనూ రోజూ మార్చుకోవాలి. 
కుటుంబం లో అందరికీ చిన్న నాటి నుండే వీటి యందు అవగాహన పెంచటం.
ii) రోజూ 50 నుండి 70 నిముషాలు నడవటం.
iii ) అధికం గా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపం లో తినడం.
iv ) మునగ ఆకూ, కాయలూ, మెంతులూ, మెంతికూర, ఆలో వేరా, కాకర కాయ, బెండ కాయ, జామ కాయల వాడకం పెంచుకోవడం, జామ, మామిడి ఆకులూ డికాక్షన్ ని ఉదయాన్నే త్రాగటం. 
v ) పాల వాడకం మానివేయడం.పెరుగు, మజ్జిగ ల రూపంలోనే వాటిని స్వీకరించటం. కొని తినే ప్యాకెడ్ ఆహారాలను దూరం పెట్టడం,
vi) మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనె లను దూరం గా ఉంచడం, గానుగ నూనెలో, organic cold-pressed నూనెలో వాడుకోవడం. 
vii ) మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం.
viii ) వరి అన్నం, గోధుమలు, మైదా పదార్థాలూ అతి తక్కువ వాడటం లేదా పూర్తి గా దూరం గా ఉంచడం. 
ix ) HFCS హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ , తెల్ల చక్కర లు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవడం, 
x) మధు మేహం2 - అందరికీ వచ్చేదే కదా అనే 'అల్ప ధోరణి' లేకుండా ఈ వ్యాధిని శాశ్వతం గా దూరం గా ఉంచే మార్గాలు పాటించడం, వ్యాధి వస్తే తప్పక సరైన ఆహారం, మారిన జీవన శైలి తో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంట కీ readings కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయం గా సరైన పద్దతి లో తెలుసుకోండి.

మానవుడికి ఆనందం స్వేచ్ఛ నుండి లభిస్తుంది. స్వేచ్ఛ రోగాలనుండి, ఆరోగ్య సంబంధమైన కష్టాల నుండి పొందాల్సి ఉంది. మన దేశాన్ని, పరిసరాల్ని, మన కుటుంబాన్ని ప్రేమిస్తూ, శ్రమ జీవి అయినా ప్రతీ మానవుడి కీ డబ్బు సంపాదన కష్టం కాదు. తద్వారా ఆనందమూ సాధ్యమే. కానీ రోగాలు- ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు మన ఆనందాలను హరిస్తాయి.ఎందుకంటే వైద్యానికి పోయి మరిన్ని పరీక్ష లూ, మరింత సంక్లిష్టమైన అర్థంకాని రోగాల కువలయం లో ఇరుక్కొని వ్యాధి నివారణ కనుచూపుమేర లో లేకుండా పోతోంది . అశాంతి కి కారణమవుతోంది .అందుకే మన ఆరోగ్యాలను మేలైన ఆహారం ద్వారా మన మే పట్టు బిగించి సాధించుకోవాలి.
పోలిష్ చేయని సిరి ధాన్యాలు మనకు ఆ శక్తి ని ప్రసాదిస్తాయి.
పోలిష్ చేయని సిరి ధాన్యాల ద్వారా మనకు ఆరోగ్యమూ సిద్హిస్తుంది, రోగాలను దూరం పెట్ట గలుగుతాం, అన్నివిధాలా మన బలాన్ని పెంచుకోగలుగుతాం.

అతి సామాన్యం గా ఈ నాటి ఆహార వ్యవహారాల వల్ల ఆశించేది 'డయాబెటిస్/చక్కర/మధుమేహం వ్యాధి'. ఇది ఒక చేదు 'ఆరంభం' మాత్రమే. క్రమంగా మన నేత్రాలు, మూత్ర పిండాలు, ఎముకలు, రక్త పీడనం(BP), పునరుత్పత్తి మండలం, హృదయ ఆరోగ్యం- అన్నింటి పై దీని ప్రభావం ఉంటుంది. పలు రోగాలకు కారకమౌతుంది.
'మన ఆహారం నుండి మన రక్తం లోకి వచ్చే గ్లూకోజు యొక్క నియంత్రణే మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది'.
సిరి ధాన్య మిల్లెట్ లే సమర్ధవంతంగా , సరైన ఫైబర్ కలిగి, మన రక్తం లోని గ్లూకోజు నియంత్రణ చేయగలవు.
అతి తక్కువ ఫైబర్ లేదా, పూర్తిగా ఫైబర్(పీచు పదార్థం) లేని మైదా, వరి అన్నం, ఈనాటి గోధుమలూ మన ఆరోగ్యానికి దోహదం చేయవు.

సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.
చక్కర వ్యాధి, అధిక రక్త పోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తం లో పెరిగిన ట్రై గ్లిసెరైడ్స్ , కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీనులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ - ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
పోలిష్ చేయని సిరి ధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జ ఉత్తేజపరచటం, రక్త శుద్ధి , థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, స్త్రీలలో ఆశించే PCO d, ఇతర పునరుత్పత్తి మండల సమస్యలు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.

వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.
సిరి ధాన్యాలు, ఆకు కాషాయాల ద్వారా క్యాన్సర్ వంటి పెద్ద రోగాల బారిన పడకుండా సామాన్యమైన ఆరోగ్యాన్ని పొంది దైనందిన జీవనం గడుపుకోవటం కూడా సాధ్యమని డాక్టర్ ఖాదర్ తెలియచేసారు. ఎంతో మంది తిరిగి తమ జీవితాలను పునరుద్ధరించుకుంటున్నారు.

Related Posts