YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పుట్టినరోజు సందర్భంగా తదుపరి చిత్రాన్ని ప్రకటించిన నితిన్..!!

పుట్టినరోజు సందర్భంగా తదుపరి చిత్రాన్ని ప్రకటించిన నితిన్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: యూత్ లో నితిన్ కి మంచి క్రేజ్ వుంది. ఈ రోజున నితిన్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. ఇంతకుముందు తనతో 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యకే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం నితిన్ గొప్పతనమేనని చెప్పాలి. నితిన్ సొంత బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితం కానుంది.  చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. తన తాజా చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుములతో చేయనున్నట్టు ఆయన కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. అంతేకాదు తన పుట్టినరోజు నాటికి మరో రెండు సినిమాలు ప్రకటిస్తానని కూడా కొన్ని రోజుల క్రితమే చెప్పాడు.

Related Posts