YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఏప్రిల్ 12 న సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న మోహన్ లాల్ 'లూసిఫర్' చిత్రం..!!

ఏప్రిల్ 12 న సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న మోహన్ లాల్ 'లూసిఫర్' చిత్రం..!!

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

జనతా గ్యారేజ్, మనమంతా,మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'. ఇప్పటికే మలయాళం లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12  న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది... ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్,  టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన ఈ సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు..

నటీనటులు: మోహన్ లాల్,పృథ్వీరాజ్ సుకుమారన్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ తదితరులు

Related Posts