YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

పవన్ బహిరంగ సభ ఈ నెల 14న గుంటూరులో

Highlights

  • 14న పవన్కల్యాణ్ సభకు తరలిరండి
  • తులసి ధర్మచరణ్ పిలుపు
పవన్ బహిరంగ సభ ఈ నెల 14న గుంటూరులో

ఈ నెల 14న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట తలపెట్టిన భారీ బహిరంగసభకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు తులసి ధర్మచరణ్ పిలుపునిచ్చారు. 

బుధవారం అరండల్పేటలోని కార్యాలయంలో పార్టీ కోశాధికారి, జిల్లా ఇన్చార్జి మారిశెట్టి రాఘవయ్యతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణం శ్రీనివాసరావు (కేకే), హజార్ శ్రీనివాసరావు, బండ్రెడ్డి చందు, గోవిందు అంజిబాబు, కిషోర్, గుడి సతీష్కుమార్, పలువురు నాయకులున్నారు.

Related Posts