YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

రజనీకాంత్ తర్వాత మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్

Highlights

  • సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీకాంత్ తర్వాత మూవీ
  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు 
  • అనిరుథ్ కి దక్కిన మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ 
రజనీకాంత్ తర్వాత మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్

రజనీకాంత్ అభిమానులు అందరూ ఆయన చేసిన 'కాలా', '2.ఓ' సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తాయనే అనుకుంటున్నారు. ఈ సమయం లో సన్ పిక్చర్స్ బ్యానర్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రజనీ అంగీకరంచారు.

ఈసంగతి తెలియగానే ఇక రజనీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను తీసుకున్నారనేది కొత్త సమాచారం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసారు. అనిరుథ్ సంగీతాన్ని ఇష్టపడే వాళ్లంతా, ఈ సినిమాతో ఆయన మార్కెట్ మరింతగా పెరగడం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ సినిమా కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి వుంది.

Related Posts