YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

టాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియా వారియర్

Highlights

  • టాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియా వారియర్
  • తొలి సినిమా ఈ రోజు విడుదల ‘ఒరు అదార్‌ లవ్‌’
టాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియా వారియర్

ప్రియా ప్రకాశ్ వారియర్ కేవలం అందమైన కనుసైగలతో దేశంలోని యువకుల హృదయాలను కొల్లగొట్టిన వర్ధమాన మలయాళ నటి. ఈ నటి టాలీవుడ్ సినిమాకు సంతకం చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రియా వారియర్ మలయాళంలో ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్రియా వారియర్ తొలి సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ఫిదా అయిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపధ్యం లో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తీయబోయే తదుపరి సినిమాలో ప్రియకు అవకాశం ఇవ్వాలని ఊహాగానాలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. పెద్ద బ్యానర్లు అయిన యూవీ క్రియేషన్స్ కూడా ఆమెతో కలిసి పని చేయాలని భావిస్తుండగా, మరోపక్క టాలీవుడ్‌ లో పేరున్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించనున్న తర్వాతి సినిమాకు ప్రియా వారియర్ తాజాగా సంతకం చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా, ఆమె నటించిన తొలి సినిమా ఈ రోజు విడుదల అయిన విషయం తెలిసినదే.

Related Posts