YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సంక్రాంతి రేసులో టాప్ హీరోస్

సంక్రాంతి రేసులో టాప్ హీరోస్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

సూపర్ స్టార్ మహేష్ బాబును టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ,నాగార్జునలు టార్గెట్ చేసారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు..ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చూసి చెప్పొచ్చు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. తాజాగా సంక్రాంతి రేసులో బాలకృష్ణ,నాగార్జునలు కూడా తమ సినిమాలతో బాక్సాపీస్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా కే.యస్.రవికుమార్ సినిమాతో రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాను ఈ నెల 12న లాంఛంగా ప్రారంభించి వచ్చే పొంగల్‌కు రెడీ  చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య కూడా ఒక్కసారి కమిటైతే సినిమా షూటింగ్ పూర్తి  కావాల్సిందే.మరోవైపు  నాగార్జున కూడా ‘మన్మథుడు 2’ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగర్రాజు’
సినిమాను వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో నాగ్ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో లేటుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. అందుకే ఇపుడు అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు. ఇంకోవైపు సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాను కూడా  సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సంక్రాంతికి ఈ సినిమా వస్తే..‘భోగి’ టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఒకవేళ వీలుకాకపోతే.. ‘ప్రతిరోజు పండగే’ అనే టైటిల్‌తో విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. మొత్తానికి సంక్రాంతి రేసులో
మొదటగా అడుగుపెట్టిన మహేష్ బాబుకు పోటీగా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా రేసులో ఉన్నారు. మొత్తానికి 2020 సంక్రాంతి పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది చూడాలి.

Related Posts