YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

హోదాపై వైసీపీ క్లైమాక్స్ సీన్

Highlights

  • స్పీకర్ ఫార్మాట్ లోనే ఎంపీల రాజీనామాలు
  • ఢిల్లీలో ధర్నా నిమిత్తం ఎంపీలకు వీడ్కోలు
  • స్పీకర్ ఫార్మాట్ లోనే ఎంపీల రాజీనామాలు
హోదాపై వైసీపీ క్లైమాక్స్ సీన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తాము చేస్తున్న పోరాటంలో తుదిదశ ప్రణాళికను వైకాపా అధినేత,ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. హోదా సాధన కోసం ఢిల్లీలో ధర్నా చేసేందుకు బయలుదేరిన నేతలను సాగనంపిన ఆయన, అంతకుముందు వారికి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం శివరాంపురం వద్ద ఉన్న ఆయన్ను వైసీపీ ఎంపీలు, నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..

చివరి అస్త్రంగా వచ్చే నెల 6వ తేదీన ఎంపీల రాజీనామాలు ఉంటాయని చెప్పారు. నేతల రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంటాయన్నారు. 5న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని సూచించారు. ఆపై 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడదామని, అప్పటికీ హోదా ఇవ్వకుంటే, చివరి అస్త్రంగా ఎంపీల రాజీనామాలు ఉంటాయని..అదే వైకాపా చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాటం క్లైమాక్స్ కు చేరిందని అభిప్రాయపడ్డ ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Related Posts