YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖరీఫ్ పై తెలంగాణ కోటి ఆశలు

ఖరీఫ్ పై తెలంగాణ కోటి ఆశలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీ సీజన్‌లలో128 లక్షలు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ లక్షంగా నిర్ధేశించుకుంది. ఇందులో ఖరీఫ్‌లో 78.7 లక్షల మెట్రిక్ టన్నలు, రబీలో 49.3 లక్షల మెట్రిక్ టన్నులు లక్షం ఉంది. మంచి వర్షాలు కురిసి, ప్రాజెక్టులన్నీ నిండి ఆయకట్టుకు సాగునీరు అందితే ఈ స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందని అంచనా వేస్తోంది. గత ఏడాది లక్షంతో చూస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. ఈ మేరకు 201920 వ్యవసాయ శాఖ ప్రణాళికలో పొందుపర్చింది. నైరుతి వర్షాలు ఆలస్యమైనప్పటికీ 97 శాతం వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పగా, ఈ ఏడాదిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు, మరికొన్ని ప్రాజెక్టల ద్వారా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం దీమాగా ప్రకటించింది.అందుకు అనుగుణంగా పంటల సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలకు పెరుగుతుందని భావిస్తున్న వ్యవసాయ శాఖ ఆహార ధాన్యాల దిగుబడి
పెరిగి, ఉత్పత్తి కూడా అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలిసింది. ఖరీఫ్, రబీ సీజన్‌లలో కలిపి కేవలం ఒక్క వరి ఉత్పత్తినే 97.9 లక్షల మెట్రిక్ టన్నులుగా వస్తుందని అంచనా.2018 19లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 126.21 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అంతకు ముందు ఏడాదిలో 95.34 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అలాగే ఖరీఫ్, రబీలలో వరి సాగు విస్తీర్ణం కనీసంగా 6 లక్షల ఎకరాల పైన పెరుగుతుందని అంచనా వేస్తోంది. గత ఏడాది అంచనాతో చూస్తే దాదాపు 3 లక్షల ఎకరాలు పెరిగింది. ఈసారి కూడా పత్తి సాగు పెరుగుతుందనే అంచనాలో వ్యవసాయ శాఖ ఉంది.గత ఏడాది 126.21 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్షంగా వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో పేర్కొంది. అయితే గత నెల రోజుల క్రిత అర్థగణాంక శాఖ విడుదల చేసిన మూడవ ముందస్తు అంచనాల ప్రకారం 91.87 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిగా ఉంది. అంటే అంచనాల కంటే 34 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. నాలుగో ముందస్తు అంచనాల తరువాత ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో, ఉత్పత్తి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న
రైతుబంధు పథకం ఎక్కువ ప్రభావం చూపుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే ఎకరాకు రూ.5 వేల చొప్పున 1.38 కోట్ల ఎకరాలకు ముందస్తు పెట్టుబడి ఇస్తుండటంతో చాలామంది పడావుగా ఉన్న భూమిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, నాణ్యమైన 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ, రైతుబంధుతో వ్యవసాయానికి మంచి ఊపు వచ్చిందంటున్నారు.

Related Posts