YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో పనిచేయని సిగ్నల్స్

సిటీలో పనిచేయని సిగ్నల్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

హైదరాబాద్ మహానగరం పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది. నగరంలోని ఎక్కువ శాతం మంది వాహనదారులు, పాదచారులు ప్రతిరోజు ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షల అమలుకు తోడు ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవటం సమస్య తీవ్రతకు కారణమని చెప్పవచ్చు. ఉన్నట్టుండి ఒక్కసారిగా సిగ్నల్స్ పనిచేయకపోవటంతో వాహనదారులు అయోమయానికి గురికాగా, వాటిని ఆన్ ఆఫ్ చేసేందుకు పోలీసులు రోడ్డుపై పరుగులు తీయాల్సి వస్తోంది. ఫలితంగా పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ అధికారులకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేకపోవటం కూడా ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. రౌండ్ ది క్లాక్ ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించిన సర్కారు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ముఖ్యమైన సిగ్నల్స్‌పై దృష్టి సారించకపోవటం గమనార్హం. నగరంలోని వీఐపీ జోన్ పరిధిలోని సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు, అంబేద్కర్ విగ్రహం వద్ధ, లక్డీకాపూల్ చౌరస్తా, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి, సికిందరాబాద్ ప్యాట్నీ కూడళ్లలో కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకుండా మోరాయిస్తున్నాయి. దీంతో అప్పటికపుడు పోలీసులు రంగంలో దిగుతూ నడిరోడ్డుపై నిలబడి మ్యానువల్‌గా సిగ్నల్స్ చూపించాల్సి వస్తోంది. గ్రేటర్ అధికారులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ట్రాఫిక్ నియంత్రణపై ముంబై నగరంలో ఏడాది క్రితం అధ్యయనం చేసినానంతరం రూపొందించిన పలు ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవటం, ప్రస్తుతమున్న సి0గ్నల్స్‌కు కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతకు ప్రధాన కారణం. వీఐపీలు, వీవీఐపీలు ఏయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే రూట్‌లోని
మాసాబ్‌ట్యాంక్ చౌరస్తాలో కూడా ఒక్కసారిగా సిగ్నల్స్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ఫలితంగా వీఐపీలు రాకపోకలు సాగించే సమయంలో కూడా పలుసార్లు సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవటంతో కాస్త ముందుగానే సిగ్నల్స్ వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారు.

Related Posts