YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో వాదనలు

మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో వాదనలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్లపై  మంగళవారం హైకోర్టులో విచారణ వాయిదాపడింది. ఇప్పటికే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలపై విధించిన స్టే కు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించినట్టుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.హైకోర్టు ఆదేశిస్తే అన్ని మున్నిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టు దృష్టికి తెచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంగళవారం హైకోర్టు తన తీర్పును వెలువడించనుంది. కోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్న అంశంపై ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.రాష్ట్రంలో మొత్తం 141 మున్సిపాలిటీలు ఉండగా వాటిల్లో పాలకమండలి గడువు తీరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలతో మొత్తం 129 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు కలిపి మొత్తం 3,385 వార్డులను ఎన్నికలను నిర్వహించాలని తలపెట్టారు. ప్రతి వార్డులో 1,500 నుంచి మూడువేల ఓటర్లు ఉండేలా జాబితాలను రూపొందించారు. ఇక కార్పొరేషన్ పరిధిలో ఒక్కో వార్డుల్లో 15వేల వరకు ఓటర్లు ఉన్నారు. కాగా అయితే కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం వెనువెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముంది తెలుస్తోంది

Related Posts