YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో 80 మలుపులు... యమ డేంజర్

సిక్కోలులో 80 మలుపులు... యమ డేంజర్

రాష్ట్రంలోని రాష్ట్ర రహదారులకు మించి జాతీయ రహదారుల్లో ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయి. జాతీయ రహదారుల్లోనే ప్రమాదాలు జరిగే అవకాశమున్న పాయింట్లు అత్యధికంగా ఉన్నాయి. కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌- 16)పై నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తో కలిసి ఎపి రవాణా శాఖ తాజాగా చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని కలుపుతూ 315 కిలోమీటర్ల మేర ఉన్న ఈ జాతీయ రహదారిపై సర్వే నిర్వహించారు. ఈ మూడు జిల్లాల్లోనే జాతీయ రహదారికి సంబంధించి 1985 సమస్యలున్నట్లు సర్వేలో గుర్తించారు. ఆమోద యోగ్యమైన, అనుమతించదగిన, తీవ్రమైన, అతి తీవ్రమైన సమస్యలుగా నాలుగు రకాలుగా విభజిం చారు. ఒక్క విశాఖపట్నం జిల్లా పరిదిలోని జాతీయ రహదారిపై 80 ప్రాంతాల్ని అతి ప్రమాదకర పాయింట్లుగా గుర్తించారు. ఈ సమస్యల్ని పరిష్కరించే పనిలో రవాణా శాఖ అధికారులు నిమగమ య్యారు. బ్రిడ్జీలు, మలుపులున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడం, బ్రిడ్జీలు, కల్వర్టుల వద్ద ఫుట్‌పాత్‌ సౌకర్యం లేకపోవడం, హైవే నుంచి ఫ్యాక్టరీ లకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆ సర్వేలో బట్ట బయలయ్యింది. కొన్ని ప్రాంతా ల్లో హైవే నిర్మాణ డిజైన్లలోనూ లోపాలున్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వేపై సమగ్ర నివేదికను న్యూ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఎఐ కార్యాలయానికి ఎపి రవాణా శాఖ కమిషనర్‌ ఇప్పటికే పంపిం చి నట్లు సమాచారం. త్వరలోనే తూర్పు గోదా వరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల గుండా వెళ్లే జాతీయ రహదారిలోని ప్రమాద కర పాయింట్లపై త్వరలోనే సర్వే చేపట్టనున్నారు.జాతీయ రహదారుల పక్కన ఏర్పాటు చేసిన దాబాలు కూడా ప్రమాదాలకు కారణమ వుతున్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దాబాల వద్దే లారీలను ఆపడం, డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడం వల్ల వాహనాలను తిరిగి హైవేలోకి నడిపే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు వివరిస్తున్నారు. హైవేల పక్కన వాహనాల్ని నిలిపేందుకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలుపుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం ప్రమాదాల్లో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు దేశ వ్యాప్తంగా 28.4 శాతం ఉండగా రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రమాదాల శాతం 36.5గా ఉంది. దేశవ్యాప్తంగా మరణిస్తున్న వారి సంఖ్య 35 శాతం ఉండగా రాష్ట్రంలో 39.8 శాతంగా ఉంది.

Related Posts