YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ స్టేషన్ లో యాప్ బేస్డ్ క్యాబ్స్

వైజాగ్ స్టేషన్ లో యాప్ బేస్డ్ క్యాబ్స్

ప్రయాణికులకు అందుబాటులో ఉండటంతోపాటు, సాధారణ చార్జీలతోనే గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా విశాఖ రైల్వేస్టేషన్‌లో యాప్ బేస్డ్ క్యాబ్స్ విధానం అమల్లోకి రానుంది. దేశంలో బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అమలవుతున్న దీనిని విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రవేశపెట్టాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ స్టేషన్‌లో ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి దీని ద్వారా యాప్ బేస్డ్ క్యాబ్స్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ నుంచి లగేజీతో గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఈ విధానం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. అందుబాటులో ఉండే, నిర్దేశించిన చార్జీలతోనే ప్రయాణికులు తమ ఇళ్ళకు చేరుకునే సౌలభ్యం కలుగుతుంది. ఉబెర్ క్యాబ్స్ ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో తమ వెంట ఉండే లగేజీతోపాటు ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళగలిగే సౌకర్యం ఉంటుంది. తరచూ దోపిడికి గురవుతున్న ఆటోలతో ప్రయాణికులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టానుసారంగా అమలయ్యే చార్జీలతో వీరికి నిత్యం సమస్యలు తప్పడంలేదు. నిర్దేశించిన చార్జీలు అమలు చేయకపోగా, ప్రయాణికులు లగేజీతో వెళ్ళాలంటే గగనంగా మారుతోంది. అలాగే ప్రైవేట్ టాక్సీలతోనూ ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిపై ప్రయాణికులు రైల్వేకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సమస్యలను అధిగమించి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే విధంగా యాప్ బేస్డ్ క్యాబ్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ఆటోలు, ప్రైవేటు టాక్సీల దూకుడుకు శాశ్వతంగా కళ్ళెం వేసేందుకు, మరోపక్క ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ విధానం తోడ్పడుతుందని భావించిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా దీనిపై అధ్యయనం చేయడం పూర్తయ్యింది. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో అమలయ్యే ఈ విధానాన్ని దత్తత తీసుకుని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించిన అధికారులు విశాఖ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు ఎంత మంది ఉంటారు? వీరంతా ఏఏ వాహనాలపై ఆధారపడుతున్నారు? సొంత వాహనాల ద్వారా వెళ్ళే ప్రయాణికులు ఎంత మంది? ఆటోలు, ప్రైవేటు టాక్సీల ద్వారా వెళ్ళే వారి శాతం ఎంత? అనే అంశాలను ఈస్ట్‌కోస్ట్‌రైల్వే అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతిరోజూ 130 రైళ్ళ ద్వారా 50 నుంచి 70 వేల మంది ప్రయాణికులు తమతమ గమ్యస్థానాలకు వెళ్ళాల్సి ఉండగా ఇందులో 40 శాతానికి పైగానే ఆటోలు, ప్రైవేటు టాక్సీలపై ఆధారపడుతున్నట్టు తేలింది

Related Posts