YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గడికోటకు జలకళ

గడికోటకు జలకళ

రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం, కడప, అనంతపురం జిల్లాల వరప్రదాయిని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. రాయలసీమలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు కు అటునుంచి గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా అవుకు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే అవుకు హెడ్రెగ్యులేటర్ నుండి గండికోట జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఆ నీరు ఇప్పుడిప్పుడే గండికోట జలాశయానికి చేరుతోంది. ఈ ప్రవాహం వేగము 15వేల క్యుసెకులు గా అధికారులు నిర్ధారించారు. మరి కొన్ని రోజుల్లో ఈ ప్రవాహం మరింత వేగం పుంజుకుందని తెలుస్తోంది. అయితే గండికోట జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు గా ఉంది. అయినప్పటికీ ముంపు వాసులు పరిహారం ఇంకా అసంపూర్తిగా ఉండటంతో కేవలం 12 టిఎంసిలు మాత్రమే నిల్వ చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి గండికోట జలాశయానికి దాదాపుగా నాలుగు టీఎంసీలు నిల్వ చేసిన అనంతరం మైలవరం జలాశయం, పైడిపాలెం జలాశయాలకు నీటిని వదిలే ఆస్కారం ఉందని తెలుస్తోంది. మైలవరం జలాశయం లో 6.5 టీఎంసీలు, పైడిపాలెం లో ఆరు టిఎంసిలు చివరగా సర్వరాయ సాగర్ లో నాలుగు టిఎంసిల నీటిని నిల్వ చేసిన అనంతరం గండికోట జలాశయం లో 12 టీఎంసీల నీటిని నిలువ చేసే ఆస్కారం ఉంది. ప్రకృతి అనుకూలించి అన్ని జలాశయాలు పూర్తిస్థాయిలో జల కల తో ఉంటే మాత్రం కడప జిల్లా ప్రజల సాగు , తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని చెప్పవచ్చు. దీనితోపాటు అనంతపురం జిల్లా ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా దాదాపుగా తీరి పోయినట్టే.

Related Posts