YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

అంబటి రాయుడికి గ్రీన్ సిగ్నల్

అంబటి రాయుడికి గ్రీన్ సిగ్నల్

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో తనని సెలక్టర్లు పదే పదే పక్కన పెట్టడంతో నిరాశ చెందిన రాయుడు.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గత నెల ఆరంభంలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే.. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్న ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)కి లేఖ రాశాడు. రాయుడి నిర్ణయానికి హెచ్‌సీఏ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. వాస్తవానికి అంబటి రాయుడు రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోబోతున్నట్లు వారం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అధికారికంగా ఝూడి అయ్యింది. రిటైర్మెంట్ ప్రకటించిన 58 రోజుల్లోనే ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తన నిర్ణయాన్ని మార్చుకోగా.. హైదరాబాద్ తరఫున 2019-20 రంజీ సీజన్‌లో రాయుడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అయితే.. మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు తనని పక్కన పెట్టడంపై రాయుడు 3D సెటైర్ పేల్చి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ జట్టులోకి 2013లో ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు.. కెరీర్‌లో ఇప్పటి వరకూ 55 వన్డే మ్యాచ్‌లాడి.. మూడు శతకాలు, 10 అర్ధశతకాలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్‌లో కనీసం ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ ఆరు టీ20లు కూడా ఆడాడు. కానీ.. మొత్తం చేసిన పరుగులు 42 మాత్రమే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. యువ క్రికెటర్లకి ఎక్కువ అవకాశాలివ్వడంపై సెలక్టర్లు శ్రద్ధ పెడుతుండటంతో 33 ఏళ్ల రాయుడికి మళ్లీ ఛాన్స్‌ దక్కడం కష్టమే..

Related Posts