YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

‘అటు ఆగ్రహం ఇటు మందలింపులు, చైతన్యం  ఆసక్తిగా కొనసాగిన మేయర్ తనిఖీలు

‘అటు ఆగ్రహం ఇటు మందలింపులు, చైతన్యం  ఆసక్తిగా కొనసాగిన మేయర్ తనిఖీలు

‘అటు ఆగ్రహం ఇటు మందలింపులు, చైతన్యం 
ఆసక్తిగా కొనసాగిన మేయర్ తనిఖీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 
అపరిశుభ్ర పరిస్థితులపై మందలింపులు, డెంగ్యు, మలేరియా వ్యాధులు ప్రబలుతున్న ఇంట్లో నీటి నిల్వలను తొలగించకపోవడం పట్ల ఆగ్రహం, సీజనల్ వ్యాధులపై ఉపాద్యాయుడిలా అవగాహన, చైతన్య కార్యక్రమం, స్వయంగా ఇళ్లపైన సంపులలో ఉన్న నీటిని తొలగించడం...ఇలా నేడు ఉదయం నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలపై క్షేత్రస్థాయి పర్యటన ఆదాత్యం ఆసక్తికరంగా సాగింది. జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబులతో నేడు ఉదయం లాలాపేట్ వినోబానగర్, మాణికేశ్వర్ నగర్ లలో మేయర్ రామ్మోహన్ పర్యటించారు. ప్రధానంగా ఈ బస్తీల్లో ఇంటింటికి వెళ్లి పరిశీలించిన మేయర్ రామ్మోహన్ స్థానికంగా ఉన్న దోమల ఉత్పత్తి స్తావరాలను చూసి ద్రిగ్బాంతికి లోనయ్యారు. డెంగ్యు వ్యాధి ప్రధానంగా ఇళ్లలో ఉండే నీటి నిల్వల ద్వారా వచ్చే దోమల వల్లే వ్యాపిస్తుందని, నగరంలో పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తమ ఇళ్లలోని ఖాళీ స్థలాలు, కుండీలు, నల్లా గుంతల్లో నీటిని తొలగించక నిర్లక్ష్యం వహించిన ఆయా ఇళ్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాణికేశ్వర్ నగర్ లో ఇళ్ల సజ్జెలపై ఉన్న నీటిని స్వయంగా పైకి ఎక్కి మేయర్ తొలగించారు. వినోబానగర్ లో డెంగ్యు వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న నికిత అనే అమ్మాయిని పరామర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తమ ఇళ్లలోని ఓవర్ హెడ్ ట్యాంక్ లను పూర్తిస్థాయిలో మూసివేయాలని, నల్లా గుంతలలోని నీటిని ప్రతిరోజు తొలగించి, ఇళ్లలో దోమ తెరలు వాడాలని, ముఖ్యంగా చిన్న పిల్లలకు శరీరాన్ని పూర్తిగా కప్పివేసే దుస్తులు వాడాలని సూచించారు. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో పారవేసిన కొబ్బరి బోండాలు, వాడిన పాత టైర్లు, కుండలు, పగిలిన డ్రమ్ లు, ఖాళీ డబ్బాలను తొలగించడంతో పాటు వాటిలో నీరు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులకు విజ్జప్తి చేశారు. ఎవరైనా జ్వరంతో బాదపడుతూ భరించలేని తలనొప్పితో ఉంటే స్థానిక బస్తీ దవాఖాన లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను సంప్రదించాలని బొంతు రామ్మోహన్ సూచించారు. ఈ విధంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు ఉదయం జరిపిన క్షేత్రస్థాయి పర్యటన ఆసక్తికరంగా జరిగింది.

Related Posts