YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టాస్క్ ఫోర్స్ పనితీరు భేష్ 

Highlights

  • ఐజి కాంతారావు కృషితో పలు సంస్కరణలు
  • పీసీసీఎఫ్ ప్రశంసలు
టాస్క్ ఫోర్స్ పనితీరు భేష్ 

తమిళనాడు లోని స్మగ్లర్లుకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకుని వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ చీఫ్‌ కన్ సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్  మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం టాస్క్ ఫోర్స్ కార్యాలయం సందర్శించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అక్కడి వారిలో సంస్కరణలు తీసుకుని రావడం గొప్ప విషయమని అన్నారు. తిరుపతి లోని టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు ఎర్ర చందనం చెట్ల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. టాస్క్ ఫోర్స్ ను అర్ధవంతంగా నడపడం కాంతారావు గారి కే సాధ్యమని, ఆయన తరువాత వచ్చే వారు ఈ విధంగా చేయలేక పోవచ్చునని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్ర చందనం రాష్టానికి గర్వకారణం అని, దాని సంరక్షణ అవసరమని అన్నారని తెలిపారు. త్వరలోనే ఎర్ర చందనం స్మగ్లర్ల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నామని, అవసరాన్ని బట్టి ఆస్తులు జప్తు చేయడం లాంటి చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటి వరకు 1500టన్నుల ఎర్ర చందనం  విక్రయాలకు అనుమతి ఉందని మరో 2500 టన్నుల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరామని తెలిపారు. కొత్త గోడవును ప్ర్రారంభించి, గ్రేడింగ్ విధానాన్ని క్రమబద్దీకరించ నున్నట్లు తెలిపారు. దీనికి ముందు ఐజి కాంతారావు గారు టాస్క్ ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఎస్పీ రవిశంకర్ మాట్లాడుతూ ఐజి కాంతారావు నేతృత్వంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. అటవీ శాఖ సహకరిస్తూ జాయింట్ ఆపరేషన్ లు చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో అడిషినల్ పీసిసిఎఫ్ బి. కె సింగ్,  ఈస్ట్ డివిజన్ డీఎఫ్వో జగనాథ్, టాస్క్ ఫోర్స్ డీఎస్పి లక్ష్మీనారాయణ, ఎసిఎఫ్ నాగార్జున రెడ్డి, సీఐ మధు, ఆర్ ఐ చెందు, మురళి, ఎస్ ఐ అశోక్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts