YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు

Highlights

  • నీటి పారుదల రంగానికి అత్యధికంగా 25వేల కోట్లు 
  • ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినిపిస్తున్నారు. ఆర్థిక మంత్రి ఈటల. రాజేందర్  .. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.

-మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
-రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు
-కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు
-ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు

-డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
-పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
-రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
-వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
-బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
-పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లు

-జీడీపీ ద్రవ్య లోటు 3.45 శాతం
-ఈ ఏడాది రాష్ర్ట జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా
-స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
-రాష్ర్ట జీడీపీ ఏటేటా పెరుగుతుంది
-ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
-సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చారు.
 

తెలంగాణ బడ్జెట్ ప్రసంగ పాఠం

Related Posts