YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

'ఉగాది'కి ముస్తాబు అవుతున్నతిరుమల

'ఉగాది'కి ముస్తాబు అవుతున్నతిరుమల

 

తెలుగువారి సంవత్సరాదియైన శ్రీ విలంబినామ ఉగాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం, పరిసరాలను పచ్చని పందిళ్ళతో, రంగవల్లులతో, దేదీప్యమానమైన విద్యుద్దీపాలతో, వివిధ రకాల పుష్పాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, శుద్థి నిర్వహించి అనంతరం తోమాలసేవను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 18వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

ఓం...నమో...వేంకటేశాయా.

Related Posts