YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బైటకు రావాలి

చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బైటకు రావాలి

చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బైటకు రావాలి
తాడేపల్లి 
పవన్ కళ్యాణ్ తన నట విశ్వ సరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడుగా ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టకుండా పవన్ దత్తపుత్రుడు వేషాలు వేస్తున్నారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొరతకు కారణాలను అన్వేషించడంలో ప్రతిపక్ష పార్టీలు వైఫల్యం చెందాయి. చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుకను దోచుకున్నారు. ఇసుకపై కొత్త పాలసీని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుకొచ్చారని అన్నారు. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యే కు తక్కువని అయన వ్యాఖ్యానించారు. వైస్సార్సీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా రాసిన వార్తలను పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ వెనుక ఉన్నవాళ్లు అందరూ చంద్రబాబు తొత్తులే. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన వాళ్లకు సీట్లు ఇవ్వలేదా. సొంత పుత్రుడు లోకేష్ పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారుని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పుస్తకాలు చదివాడో తెలియదు కానీ ప్రతి రోజు ఎల్లో మీడియా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం ప్రతి రోజు చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ దృష్టిలో రాజధాని అంటే టీడీపీ నేతలు భూముల కొనుక్కున్న రాజధానా...? పవన్ కళ్యాణ్ చంద్రబాబు దొంగ నాటకాలు ఆపాలని అయన అన్నారు. పవన్ కళ్యాణ్ తీరు చూసి ప్రజలు  నవ్వుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్షలు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ కు భయం. అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలో టీడీపీ నేతలు ఎందుకు కూర్చున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు అచ్చెన్నాయుడు సచ్ఛిశీలురా. పవన్ కళ్యాణ్ ఒక చేతిలో తాళి మరొక చేతిలో ఎగతాళి ఉంటుంది. తాళి ఎప్పుడు కడతారో, ఎవర్ని ఎప్పుడు ఎగతాళి చేస్తారో పవన్ కళ్యాణ్ కే తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నీ కంటికి కనిపించడం లేదు. జనసేన పార్టీ కార్యాలయ స్థలం ఎవరి దగ్గర కొన్నారు.. ఎంతకు కొన్నారని అడిగితే సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో భవన నిర్మాణ కార్మికులు లేరు.. టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బైటకు రావాలని అయన అన్నారు.

Related Posts