YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది.. 

Highlights

  • కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా రాష్ట్రాన్ని విభజించాయి.
  • తెలుగు వారికీ ఉగాది శుభాకాంక్షలు.
  • కోటప్పకొండలో పర్యటించిన ఏపీ స్పీకర్ కోడెల
 ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది.. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుదన్న భావన 5కోట్ల మంది ఆంధ్రుల్లో బలంగా ఉందని ఏపీ శాసనసభాపతి డా. కోడెల శివప్రదరావు అన్నారు. శనివారం ఆయన కోటప్పకొండలో పర్యటించారు. ఈ సందర్భగా స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర సహకారం లేకపోయినా సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో 4సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా రాష్ట్రాన్ని విభజించాయి.అప్పుడు 15సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన బీజేపీ అధికారం రాగానే మాటమార్చడం సబబు కాదన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజల సహకారంతో అద్భుతమైన అభివృద్ధి చేశామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
రాజకీయాలు విలువలు, ఆదర్శలతో చేయాలని సూచించారు.

నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయాలన్నారు. రోంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా రైతుల వద్ద నుండి కందులు, శనగలు కొనుగోళ్లు చేపట్టనున్నట్టు తెలిపారు.కాని రాజకీయ కారణాలతో అనవసర రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు.అధికారులపై దాడి అమానుషమన్నారు. గతంలో తానూ అనేక ఉద్యమాలు చేశాను..అవన్నీ ప్రజస్వామ్యబద్దంగా చేశామని స్పష్టం చేశారు. కోటప్పకొండలో అభివృద్ధి పనులు పరిశించిన స్పీకర్ ఆ ప్రాంతాన్ని 5జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని  అధికారులకు సూచించారు. 
ఉగాది శుభాకాంక్షలు.. 
దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు సభాపతి కోడెల తెలిపారు. ఉగాది పండుగ అంటే జీవితమని చెప్పారు. జీవితంలో ఏ విధమైన కష్టసుఖాలు ఉంటాయో.ఉగాది పచ్చడిలో కూడా అదే విధంగా ఉంటుందన్నారు. సమావేశంలో పాల్గొన్న అటవీ, దేవాదాయ శాఖ అధికారులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కడియాల రమేష్.


 

Related Posts