YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అసలు మహాభారతంలో 'పీకే' పాత్ర ఏంటి ?

Highlights

  • మహాభారతం లో అమిర్ ఖాన్ ది  ఏ పాత్ర 
  • 'మహాభారతం' కో-ప్రొడ్యూసర్ గా ముకేశ్ అంబానీ 
  • రాజమౌళి మరో బారి బడ్జెట్ సినిమా 'మహాభారతం'
అసలు మహాభారతంలో 'పీకే' పాత్ర ఏంటి ?

వినూత్నమైన పాత్రలో నటించడానికి పెట్టింది పేరు అమిర్ ఖాన్. దంగల్, పీకే, లగాన్ ఇలాంటి ఎన్నో సినిమాలలో ఒక కొత్త రకమైన పాత్రలను పోషించించాడు. ఇక పోతే కొత్తగా బాలీవుడ్  సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతుంది. అఫీషియల్ గా అమిర్ ఖాన్ తన తరువాత ప్రాజెక్ట్ గురించి ఏలాంటి సమాచారం వెల్లడించక పోయినా 'మహాభారతం' వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. తనకు పురాణ ఇతిహాసంలో నటించాలని ఉందని, ముఖ్యంగా కర్ణుడు, కృష్ణుడు పాత్రలంటే తనకెంతో ఇష్టమని గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియా ముందు వ్యక్తం చేసారు.

అమిర్ ఖాన్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం లో రోపొందబోయా 'మహాభారతం' లో కృష్ణుడి పార్థలో నటించబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

పీకే కృష్ణుడి పాత్రలో నటించడానికి  మొగ్గు చూపే అవకాశాలున్నాయని మరో వార్త వినబడుతోంది. ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' షూటింగ్ పూర్తి కాగానే అమీర్ 'మహాభారతం' పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చితరానికి కో-ప్రొడ్యూసర్ గా ముకేశ్ అంబానీ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.

Related Posts