YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కోడుమూరులో మెగా రక్తదాన శిబిరం

 సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కోడుమూరులో మెగా రక్తదాన శిబిరం

 సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కోడుమూరులో మెగా రక్తదాన శిబిరం
కోడుమూరు (కర్నూలు) డిసెంబర్ 21 :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం కోడుమూరులోని జడ్పీహెచ్‌ స్కూల్‌ ఆవరణలో ఎంఎల్‌ఎ డాక్టర్‌ జె.సుధాకర్‌, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేసి చూపించామని పేర్కొన్నారు. అలాగే చేనేత భరోసా ద్వారా లక్షలాది మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతో రక్తదానం చేసిన కోడుమూరు, గూడూరు, సీ బెళగల్‌, గోనెగండ్ల వైసీపీ కార్యకర్తలకు అభినందలు తెలిపారు. అలాగే సుమారు 70 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులు మాజీ ఎంపీ బుట్టా రేణుక, సీనియర్‌ నాయకులు బీవై రామయ్య హాజరుకాగా మాజీ ఎంపీపీ రఘునాథరెడ్డి, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, నాయకులు రమేష్‌నాయుడు, సాజిత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు

Related Posts