YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే పెద్దఎత్తున ఉద్యమం: ఆర్. కృష్ణయ్య

 మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే పెద్దఎత్తున ఉద్యమం: ఆర్. కృష్ణయ్య

 మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే పెద్దఎత్తున ఉద్యమం: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్ డిసెంబర్ 23
వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 26 శాతానికి తగ్గించాలని రాష్ట ప్రభుత్వం  నిర్ణయిచినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోని యధాతధంగా 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించక పోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. త్వరలో ఎన్నికలు జరిగే 128 మునిసిపాలిటీలలో బీసీలకు 33 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో బీసీలకు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది మార్చి 34 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు మునిసిపాలిటీలలో 45, కార్పొరేషన్లలో 4 సీట్లు కేటాయించాలని కోరారు. 1988 నుంచి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. జనాభా  ప్రకారం 34 నుంచి 56 శాతం కు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుంటే, ఇప్పుడు 34 శాతం నుంచి 26 శాతంకు తగ్గించడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు మున్సిపల్ ఎన్నికలలో 50 శాతం టికెట్లు ఇస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటించారు, అలాగే బిజెపి పార్టీ కూడా 50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని ఆయనడిమాండ్ చేసారు.టి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం తగ్గించారు. అమలు చేసేటప్పుడు 18 శాతం తగ్గించి అమలు చేశారు. 12,756 గ్రామపంచాయతీ సర్పంచ్ లలో బీసీలకు కేవలం 2218 మాత్రమే కేటాయించారు. ఇది 18 శాతం మాత్రమే. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అణచి వేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను తగ్గించడం అన్యాయం. సుప్రీం కోర్టు తీర్పు 2010 లో వచ్చింది, ఆ తర్వాత జరిగిన 2013 గ్రామ పంచాయతీ - మున్సిపల్ ఎన్నికలలో, 2014 లో జరిగిన ఎం.పీ.టీ.సీ-జ.డ్పి.టి.సి ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు.మున్సిపల్ రిజర్వేషన్లు తగ్గిస్తే తెరాస పార్టీలో ఉన్న బి.సి మంత్రులు – శాసన సభ్యులు ముఖ్యమంత్రిపై వత్తిడి చేవాలని కోరారు. లేని పక్షంలో మంత్రులను – శాసన సభ్యులను గెరావ్ చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లు తగ్గిస్తే ఒక వైపు వీది పోరాటాలు చేస్తూ – ఇంకొకవైపు సుప్రీంకోర్టు లో కేసు వేస్తామని కృష్ణయ్య అన్నారు.

Related Posts