YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 26 నుండి సచివాలయాల్లో  ట్రయల్ వర్క్

ఈ నెల 26 నుండి సచివాలయాల్లో  ట్రయల్ వర్క్

ఈ నెల 26 నుండి సచివాలయాల్లో  ట్రయల్ వర్క్
శ్రీకాకుళం, డిసెంబరు 23 
గ్రామ సచివాలయాల్లో ఈ నెల 26 నుండి ఆన్ లైన్ విధానం లో కార్యకలాపాలు నిర్వహించుటకు ట్రయల్ వర్క్ ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షిస్తూ 26 నుండి 1వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వహించి లోపాలు ఉంటే సరిదిద్దడం జరుగుతుందని అన్నారు. సచివాలయాలలో ఇంటర్నెట్ కనెక్షన్ పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని సచివాలయాలలో కంప్యూటర్ ఏర్పాటు తక్షణం ఏర్పాటు చేసే అవకాశం లేదని అటువంటి సచివాలయాల్లో సొంత లాప్ టాప్ కలిగిన వ్యక్తులతో మాట్లాడి వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. వారికి రోజుకు వంద రూపాయలు అద్దెగా చెల్లించడం జరుగుతుందని అన్నారు. ట్రయల్ రన్ లో ప్రజల ఆర్జీలకురసీదు ఇవ్వాలని అన్నారు. దీనిపై మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అర్హత, అనర్హత తెలియజేసే  బోర్డులను సచివాలయాలలో పెట్టాలని అన్నారు.రాత్రి బస బాగుంది :అధికారులకు జారీ చేసిన ఆదేశాల మేరకు అందరూ రాత్రి బస చేశారని కలెక్టర్ ప్రశంసించారు. వసతి గృహంలో  సమస్యలు గమనించాలని అన్నారు.  మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలని చెప్పారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి,  ఏపిఎంఐపి పిడి ఏవిఎస్వి జమదగ్ని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎం.చెంచయ్య,  ఐసిడిఎస్ పిడి జి.జయదేవి,బిసి కార్పొరేషన్ ఇ.డి జి.రాజారావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె. కృత్తిక, ఎస్.సి కార్పొరేషన్ ఇడి సి.హెచ్.మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Related Posts