YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలును పరిపాలనా రాజధానిగా ప్రకటించాలి 

కర్నూలును పరిపాలనా రాజధానిగా ప్రకటించాలి 

కర్నూలును పరిపాలనా రాజధానిగా ప్రకటించాలి 
- జిల్లా కాంగ్రెస్ 
కర్నూలు డిసెంబర్ 23
రాష్ట్ర ముఖ్యమంత్రి   ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని చెప్పడం మంచి పరిణామమని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ స్వాగతించింది. అలాగే పరిపాలన రాజధాని  విశాఖపట్నంలో పెట్టడం వలన రాయలసీమ జిల్లా ప్రజలకు సుమారు1000 కిలోమీటర్లు దూరం పెరుగుతుందని రాయలసీమ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని హైకోర్టుతో పాటు పరిపాలనా రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తే వాటికి అవసరమైన సదుపాయాలు సౌకర్యాలు కార్యాలయాలు  కర్నూలులో ఉన్నాయని  పేర్కోంది. కనుక రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేసినట్లవుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు సి అశోకరత్నం అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ  పివి నరసింహారావు గారి 15 వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అయన  స్పందించారు . ముందుగా పార్టీ కార్యాలయం లో  పీవీ నరసింహారావు గారి చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత జరిగిన ఎన్నికలలో జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించడంతో కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ  కార్యాలయం ముందు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె పెద్దారెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో విజయం సాధించడం శుభపరిణామమని ఈ ఫలితాలు చూస్తుంటే బిజెపికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ సత్యరాజు ఓర్వకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు డిసిసి సెక్రటరీ డి రాముడు కాంగ్రెస్ నాయకులు జబ్బార్ మస్తాన్ కేశవరెడ్డి మల్లికార్జున అబ్బి నాయుడు దస్తగిరి ఆంజనేయులు మహిళా కాంగ్రెస్ వెంకటలక్ష్మి మద్దమ్మ ఎల్లమ్మ సుజాత  శాంతి లక్ష్మి సూర్యకుమారి అంజలి వారు పాల్గొన్నారు.

Related Posts