YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి -  జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి -  జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్

 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి
-  జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల  డిసెంబర్ 23  
జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణి ప్రారంభానికి ముందు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే జిల్లాలోని బీడు భూములకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగర్ జలాలు సౌకర్యం కలిగనున్నందున ఆ దిశగా రైతులకు పంటల సాగు పై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అట్లాగే లాభదాయకమైన ఉద్యానవన పంటల సాగు పై రైతులు ప్రత్యేక దృష్టి సారించే లా చూడాలి అన్నారు.వ్యవసాయ అనుబంధ రంగాల వైపు దృష్టి సారించే లా రైతులను సమాయత్తం చేయాలి అన్నారు. ముఖ్యంగా పామాయిల్ సాగు పై రైతులకు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటర్ మ్యాప్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అలాగే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు బజార్ మార్కెట్ యార్డ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మిషన్ భగీరథ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగు నీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ భగీరథ అధికారులను ఆదేశించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కిచెన్ షెడ్లు రన్నింగ్ వాటర్ వారి బెంచీలు విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారినీ ఆదేశించారుఅన్ని గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలన్నారు స్వచ్ఛ దర్ప న్ ర్యాంకింగ్ లో జిల్లా ముందంజలో ఉండేలా చూడాలని కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు.మానేరు కు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు పకడ్బందీ కార్యచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మండలాల వారీగా ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగు పరిచేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు.పర్యాటక అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకొని రామప్ప గుట్టపై అతిథి గృహం కు అనువైన సైట్ ను ఎంపిక చేయాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. అర్బన్ లంగ్ స్పేస్ కోసం స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కొత్తచెరువు అభివృద్ధి కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.సమీకృత కలెక్టరేట్ భవనంను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని రహదారులు భవనాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్  యాస్మిన్ భాష జిల్లా ప్రత్యేక అధికారి రాహుల్ శర్మ శిక్షణ కలెక్టర్  బి సత్య ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి  ఖీమ్యా నాయక్ , రాజస్వ మండల అధికారి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు

Related Posts