YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అమరావతిలో పతాక స్థాయికి నిరసనలు

 అమరావతిలో పతాక స్థాయికి నిరసనలు

 అమరావతిలో పతాక స్థాయికి నిరసనలు
విజయవాడ, డిసెంబర్ 23,
మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళనకు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తుళ్లూరులో బీసీ రైతు సాంబశివరావు అరగుండు, అర మీసం, గడ్డంతో వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధాని లేకపోతే తాము బిచ్చగాళ్లగా మారాల్సి వస్తుందని బొచ్చతో వినూత్నంగా నిరసన చేశాడు. తాను వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అంటున్నారు సాంబశివరావు.. తనకు ఉన్న అర ఎకరం భూమి ఇచ్చినందుకు ఇలా అరగుండుతో నిరసన తెలుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలియజేశాడు.తుళ్లూరు మాత్రమే కాదు మందడంలో కూడా రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. చొక్కాలు తీసి అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు.. రోడ్డుపై బైఠాయించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. రైతులు వాగ్వాదానికి దిగారు. అంతకముందు తుళ్లూరులో రైతులు మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కోసం రైతులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అమరావతి ప్రాంతంలోని మిగిలిన గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ధర్నాలతో హోరెత్తడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో బలగాలను మోహరించారు.

Related Posts