YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 మళ్లీ రాహుల్ జపం

 మళ్లీ రాహుల్ జపం

 మళ్లీ రాహుల్ జపం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24
కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వచ్చినట్లే కన్పిస్తున్నాయి. భవిష్యత్తు ఉంటుందన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలను సాధించడం ఆ పార్టికి మద్దతు పెరుగుతున్నట్లే కన్పిస్తుంది. నిజానికి జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఇన్ని స్థానాలను దక్కించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కూటమిగా ఏర్పడినా ఆ పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు కలసి ఎన్నికల్లో పోటీ చేసినా అనేక చోట్ల ఒకరికి ఒకరు సహకరించుకోలేదన్నది వాస్తవం.అయినా జనం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. ఆర్టికల్ 370, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు వంటి అంశాలు కాంగ్రెస్ ను మరింత దెబ్బతీస్తాయని భావించినా జార్ఖండ్ ప్రజలు కాంగ్రెస్ కే జై కొట్టారు. జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కూటమి సిద్ధమయింది. అయితే కాంగ్రెస్ కు శుభసంకేతాలు తలెత్తాయని చెప్పేందుకు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయన్నది వాస్తవం.ఢిల్లీ పక్కనే ఉండే హర్యానాలోనూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు అధికారంలోకి వచ్చినంత పనిచేసింది. అయితే చివరి నిమిషంలో బీజేపీ స్ట్రాటజీతో వెళ్లడంతో అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల తర్వాత మరోసారి రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత తిరిగి ఆ పదవిని సోనియాగాంధీ చేపట్టాల్సి వచ్చింది.జార్ఖండ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ లో తిరిగి రాహుల్ జపం ప్రారంభమయింది. ఢిల్లీ ఎన్నికల నాటికి రాహుల్ ను తిరిగి పదవిలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యువనేతలు కొందరు ఇదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ వరసగా రాష్ట్రాలు కోల్పోతుండటంతో కాంగ్రెస్ కు నాయకుడు రాహుల్ మాత్రమేనని జనంలోకి ఇప్పటి నుంచి తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ అగ్రనేతల అభిప్రాయంగా ఉంది. మరి రాహుల్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts