YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతుల ఆందోళనలో తప్పు లేదు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

అమరావతి రైతుల ఆందోళనలో తప్పు లేదు  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

అమరావతి రైతుల ఆందోళనలో తప్పు లేదు
        నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
పశ్చిమ గోదావరి డిసెంబర్ 24  
;: అమరావతి రాజధాని మార్పుపై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు. అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుందని చెబుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. రాజధానిపై పూర్తి క్లారిటీ.. కేబినెట్‌లో ఆమోదం, అసెంబ్లీలో ఆమోదం జరిగితే కానీ రాదన్నారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి కనుక తమకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిందని.. దానితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి ఏ లోటు జరగదన్నారు. అమరావతిలో అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం కూడా జరిగిందని గుర్తు చేశారు.సంక్రాంతి కోడి పందాలపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. జూదానికి, హింసకు తావు లేని కోడిపందాలు సంక్రాంతికి కచ్చితంగా జరుగుతాయన్నారు. కోడిపందాలు సంక్రాంతి పండగలో ఒక భాగమని.. మన సంస్కృతీసంప్రదాయలలో అంతర్భాగమన్నారు. కోడి పందాలను మన గోదావరి జిల్లాల నుంచి ఎవరూ విడదీయలేరని.. అలా ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

Related Posts