YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పురపాలక ఎన్నికలను బిజెపి క్యాష్ చేసుకోనుందా?

పురపాలక ఎన్నికలను బిజెపి క్యాష్ చేసుకోనుందా?

పురపాలక ఎన్నికలను బిజెపి క్యాష్ చేసుకోనుందా?
హైదరాబాద్ డిసెంబర్ 24  
తెలంగాణలో పురపాలక సంఘాల ఎన్నికలకు తెర లేసింది. నెలల తరబడి వాయిదాపడుతున్న మునిసిపల్ ఎన్నికలకు కేసీఆర్ సర్కారు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఏకంగా నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. న్యూ ఇయర్ లో తొలి నెలలోనే మొదలై ముగిసే ఈ ఎన్నికలకు అధికార పార్టీగా ఉన్న టీఆర్ ఎస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమేనని చెప్పాలి. అదను చూసుకుని మరీ కేసీఆర్ సర్కారు... వచ్చే నెలలో ఎన్నికలకు తెర లేపిందన్న వాదనలూ లేకపోలేదు. అయితే అధికార పార్టీ అనుకున్నంతగా సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేవని తీరా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన టీఆర్ ఎస్ టెన్షన్ లో కూరుకుపోయిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో సార్వత్రికంలో సత్తా చాటిన బీజేపీ... టీఆర్ ఎస్ లోని టెన్షన్ ను క్యాష్ చేసుకునేలా పావులు కదుపుతోంది.టీఆర్ఎస్ లో ఎన్నికల వేళ కొత్తగా మొదలైన టెన్షన్ విషయానికి వస్తే... కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రతిపాదించిన క్యాబ్ ఎన్నార్సీ బిల్లులకు టీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకంగా ముందుకు సాగింది. ఎన్నార్సీని తెలంగాణలో నిర్వహించబోమని కూడా కేసీఆర్ సర్కారు తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే వైఖరిని ముస్లింల పార్టీగా పేరుపడ్డ మజ్లిస్ కూడా ప్రకటించింది. మజ్లిస్ తో పొత్తు కారణంగానే ఎన్నార్సీకి కేసీఆర్ వ్యతిరేకమని చెప్పారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఆసరా చేసుకున్న బీజేపీ... టీఆర్ఎస్ ను హిందూ వ్యతిరేక ముస్లిం అనుకూల పార్టీగా ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసిందట. ఈ ముద్ర పడితే... తనకు జరిగే నష్టమేమిటన్న విషయం టీఆర్ ఎస్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే... అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బ కొట్టిన టీఆర్ ఎస్... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అదే బీజేపీ చేతిలో చావుదెబ్బ తినింది.ఈ తరహా మిశ్రమ ఫలితాలకు కేవలం - హిందూ వ్యతిరేకత టీఆర్ ఎస్ పై పడటమే కారణమని చెప్పక తప్పదు. సరిగ్గా ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలకు తెర లేసిన వేళ... ఎన్నార్సీకి వ్యతిరేకమని మజ్లిస్ వాదననే వినిపిస్తే... టీఆర్ ఎస్ పై హిందూ వ్యతిరేక ముద్ర పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే ఓ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారట. ఈ విషయం తెలిసిన వెంటనే గులాబీ గూటీలో నిజంగానే టెన్షన్ మొదలైపోయిందట. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో అసలు ఎన్నార్సీపై తాను తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకునే పనిలో ఇప్పుడు గులాబీ దళం బిజీ అయిపోయిందట. ఓ వైపు జనం మదిలో మాటను తెలుసుకునే యత్నం చేయడంతో పాటుగా బీజేపీ సిద్ధం చేస్తున్న వ్యూహంపైనా కేసీఆర్ కీలక దృష్టి సారించినట్లుగా సమాచారం. మొత్తంగా మునిసిపల్ ఎన్నికల వేళ గులాబీ గూటిలో మొదలైన టెన్షన్.. అధికార పార్టీకి ఏ మేర బ్యాండేస్తుందో చూడాలి. అదే సమయంలో ఈ టెన్షన్ ను ఆసరా చేసుకుని కలమ దళం ఏ మేర చక్రం తిప్పుతుందో కూడా చూడాలి.

Related Posts