YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్దం

క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్దం

క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్దం
విజయవాడ డిసెంబర్ 24
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్‌మస్‌ వేడుకల హడావుడి ప్రారంభమైంది.క్రిస్మస్ కేకులు, క్రిస్‌మస్‌ చెట్లు, దీపాలంకరణలతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రిస్‌మస్‌ అనగానే గుర్తుకు వచ్చే శాంతా క్లాస్‌ దుస్తుల్లోనూ, క్రిస్‌మస్‌ చెట్ల దుస్తుల్లోనూ నవజాత శిశువులు దర్శనమిస్తూ అందరినీ అలరిస్తున్నారు.క్రిస్‌మస్‌ ట్రీ దుస్తులు, శాంతాక్లాస్‌ దుస్తుల్లో చిన్నారులు హడావుడి విశేషంగా ఆకర్షిస్తోంది.చూడముచ్చట గొలిపేలా వేడుకలను నిర్వహించేందుకు తెలుగు ప్రజలు సిద్దమవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్దమవుతోంది.ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచక సాగిపోతున్నాయి.ఏసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా గల క్రైస్తవులు పండుగ చేసుకునేందుకు రెడీ అయిపోయారు.ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి కొనసాగుతోంది. ప్రధాన నగరాలకు పండుగ శోభ వచ్చేసింది.ఇక శాంటాక్లాజ్ హంగామా, క్రిస్మస్ షాపింగ్ హడావుడి మమూలుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎలా ఉన్నాయంటే...పండుగ వేడుకల్లో ప్రజలు తలమునకలయ్యారు. చర్చిలు కొత్త రూపును సంతరించు కున్నాయి. విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అటు ఆయా దేశాల్లోనూ క్రిస్మస్ హంగామా మొదలైంది.క్రిస్మస్ అంటేనే షాపింగ్ తప్పనిసరిగా మారింది.అందుకే షాపింగ్ మాల్స్‌కు తాకిడి పెరిగింది. మరీ ముఖ్యంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్ క్యాప్స్‌తోపాటు గిఫ్ట్‌లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నెల రోజుల ముందునుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. క్రిస్మస్‌కు ముందు రోజు రాత్రి శాంటాక్లాజ్ అందరికి బహుమతులు అందజేస్తాడని విశ్వాసం ఉంది. అందుకే చాలా మంది ఈ విషధారణలో పిల్లలకు బహుమతులు అందజేసే శాంతాక్లాజ్ వేషదారణతో క్రిస్మస్ వేడుకలకు సరికొత్త శోభను తెచ్చేలా ప్రజలు సిద్దమవ్వడంతో క్రస్మస్ హడావుడి నెలకొంది.దీంతో చర్చిలన్నీ  అర్ధరాత్రి వేడుకల కోసం సిద్దబయ్యాయి. 

Related Posts