YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చక చకా కొనసాగుతున్న కల్వకుర్తి పనులు 

చక చకా కొనసాగుతున్న కల్వకుర్తి పనులు 

చక చకా కొనసాగుతున్న కల్వకుర్తి పనులు 
మహబూబ్ నగర్, డిసెంబర్ 26, br /> శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 25 టీఎంసీల నీటితో 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వటం కల్వకుర్తి ప్రాజెక్టు లక్ష్యం. 30 యేళ్ల క్రితం కల్వ కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరులో మొదటి రిజర్వాయర్, సింగోటం దగ్గర రెండో రిజర్వాయర్, జొన్నల బొగడ, గుడిపల్లె దగ్గర నాలుగు రిజర్వాయర్ల ద్వారా నాగర్ కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకద్ర నియోజక వర్గాల్లో సాగుభూమికి నీళ్లివ్వాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.2002లో అప్పటి ప్రభుత్వం కల్వకుర్తి లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించింది. 17వందల 66 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు .. 2014 నాటికి 3వేల 7 వందల కోట్లకు చేరింది. 12 ఏళ్లు గడిచినా పనులు నత్తనడకన సాగటంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఎక్కడిక్కడ కాల్వలు తవ్వటం, పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులు, పంప్ హౌస్ పనులు పూర్తి చేశారు.కల్వ కుర్తి లిఫ్టు ఇరిగేషన్ కు సంబందించి మెయిన్ కెనాల్ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ చానల్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 చెరువులు, కుంటలు నీళ్ళతో నింపారు. దీంతో ఎప్పటి నుంచో ఎండిపోయిన బావులు, బోర్లలోకి మళ్లీ నీళ్ళు వచ్చాయి. ఈ యేడాది ఒక పంటను తీసిన రైతులు.. ఇప్పుడు రెండో పంటకు సిద్ద మవుతున్నారు. రైతుల అవసరాలను గుర్తించిన మంత్రి హరీష్ రావు…ఈ ప్రాజెక్టు పరిధిలో మరో 20 చిన్న చిన్న రిజర్వాయర్ లు కట్టాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికారులు ఆ దిశగా సర్వేలు చేస్తున్నారు.వచ్చే యేడాది కల్లా కల్వ కుర్తి పూర్తి ఫలితాలను రైతులకు అంద జేస్తామని అధికార పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో భారీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు. 60 రోజుల నీటి లభ్యతతో 120 టీఎంసీల నీటిని 12 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు హైదరాబాద్ కు తాగునీరు.. పరిశ్రమలకు ఉపయోగపడేవిధంగా ప్లాన్ వేశారు. మహబూబ్ నగర్ లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి లో 5 లక్షల ఎకరాలు, నల్గొండ లో 30 వేల ఎకరాల సాగుభూమికి నీళ్ళు ఇవ్వటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు 35 వేల రెండువందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.మొదటి రిజర్వాయర్ నార్ల పూర్ నుంచి ఏదుల రిజర్వాయర్, వట్టెం, కర్వెన, ఉద్దపూర్ లలో రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా నీళ్ళు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. టెన్నెల్స్, ఓపెన్ కాలువలు, లిఫ్టుల ద్వారా నీటిని రైతులకు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. ఒక వైపు మెయిన్ కెనాల్, మరో వైపు రిజర్వాయర్ల పనులు ఏక కాలంలో చేస్తున్నారు.

Related Posts