YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ధనుష్ థామ్

ధనుష్ థామ్

ధనుష్ థామ్

శ్రీ మద్రారామాయణ కాలములో "విదేహ" అనే రాజ్యం వుండేది.
ఆ రాజ్యాన్ని ఏలిన మహారాజు జనకుడు.  ఆయన రాజర్షి గా పేరు పొందాడు.  ఆ రాజ్యం జనకపురి అని పిలవ బడేది.  ఆ జనకపురియే సీతాదేవి జన్మస్థానం.  ప్రస్తుతం నేపాల్ రాజధాని అయిన ఖాట్మాండు నుండి,375 కి.మీ దూరం లో వున్నది జనకపురి.  సంవత్సరమంతా, యాత్రీకులు యీ జనకపురి సందర్శనానికి వస్తారు.  'జానకీ మందిర్' అనే పేరుతో నిర్మించిన యీ అద్భుతమైన ఆలయమునకు  వచ్చి, సీతాదేవి ని దర్శించుకొని వెళ్తారు యాత్రీకులు.  
సీతారాముల కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం కూడా ఇక్కడే ప్రక్కన వున్న ది.  
సీతాదేవి. స్వయంవరం జరిగిన ప్రదేశం , శ్రీ రాముడు శివధనుర్భంగం గావించి, సీతను పరిణయమాడి నది, యీ ధనుష్ ధామ్ లోనే అని చెప్తారు.  మూడు ముక్కలు గావించిన ఆ ధనుస్సు లోని ఒక భాగం  యీ ధామ్ లో దర్శింప గలము.  ప్రక్కనే ఆంజనేయుని కి ఆలయ ము వున్నది.  సంక్రాంతి రోజున  ధనుష్ ధామ్ దర్శనం వలన పుణ్యం లభిస్తుంది అని చెప్తారు.
ఆ రోజున నేపాల్ నుండి  మాత్రమే కాకుండా ఇతర ప్రదేశములనుండి కూడా  లక్షలాది  యాత్రీకులు వచ్చి యీ పుణ్యస్థలాన్ని దర్శనం చేసుకుంటారు....

Related Posts