YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాక్షిపై లోకేష్ 75 కోట్ల పరువు నష్టం

సాక్షిపై లోకేష్ 75 కోట్ల పరువు నష్టం

సాక్షిపై లోకేష్ 75 కోట్ల పరువు నష్టం
హైద్రాబాద్, జనవరి 25,
సాక్షిమీడియాపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. విశాఖ‌ 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో ఏకంగా రూ.75కోట్లకు దావా వేశారు. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వాజ్యం దాఖలు చేసి.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సాక్షి తప్పుడు కథనం ప్రచురించిందని లోకేష్‌ ప్రస్తావించారు. లోకేష్ తన పరువు నష్టం దావా వేశారు. 2019 అక్టోబ‌ర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి 25 ల‌క్షలండి’ పేరుతో కథనాన్ని ప్రచురించిందని.. తనపై తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి అంటున్నారు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి. @ysjagan గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, సాక్షి మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది. (1/5)లోకేష్ తన ట్వీట్‌లో అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి,. తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది అన్నారు లోకేష్. టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చిందన్నారు. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను అన్నారు లోకేష్. వివరాలను ట్వీట్ చేశారు.

Related Posts