YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముస్తాబవుతున్న శ్రీవారి వసంత మండపం

Highlights

  •  29 నుండి 31వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు
  • ఆర్జితసేవలు రద్దు
ముస్తాబవుతున్న శ్రీవారి వసంత మండపం

తిరుమలలో ఈ నెల 29వ తేదీ నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వసంత మండపాన్ని భూలోకనందనవనంగా తీర్చిదిద్దుతున్నారు.వసంతోత్సవ ప్రారంభ రోజున ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతూ వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు  వసంత మండపంలో  రమణీయ ప్రకృతి సౌదర్యం ఉట్టిపడేలా వృక్షాలు, తీగలు, ఆకులు, ఫలాలతో రూపొందిస్తున్న వసంత మండపంలో శ్రీవారు వేసవి తాపం నుండి ఉపసమనం పొందనున్నారు. ఈ వనంలో జింకలు, కుందేల్లు, నెమళ్ళు, ఆవు - దూడ, ఏనుగు, సింహం, పులి, ఖడ్గమృగం, సీతాకోకచిలుకలు, వంటి అనేక పశుపక్షాదులతో పాటు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా జిరాఫి, జీబ్రా, దేవాంగపిల్లి సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు.  ఇందులో సెలఏరు - జలపాతాలు, సింహల అరుపులు వినిపించేలా ఆడియో సిస్టం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్‌ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేస్తున్నారు. దాదాపు 20 మంది ఉద్యానవనశాఖ సిబ్బంది 10 రోజుల నుండి వసంత మండపాన్ని భూలోక నందనవనంగా రూపొందిస్తున్నారు.తమిళనాడులోని కుంభకోణానికి చెందిన దాత శ్రీమీనాక్షిసుందరం ఈ భూలోక స్వర్గాన్ని తలపించే ''వసంతవనం'' ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 
 30న స్వర్ణరథోత్సవం - రెండవరోజు మార్చి 30వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు బంగారు రథం అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు.అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారు.  ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.  
ఆర్జితసేవలు రద్దు -వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 29వ తేదీన తిరుప్పావడసేవ, మార్చి 30వ తేదీన తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనంసేవలను రద్దు చేశారు. అదేవిధంగా మార్చి 29 నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొంటారు.

Related Posts