YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఆధార్‌ అనుసంధానం తరహాలో భూధార్‌ 

Highlights

  • అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో అమలు 
  • సిఎఫ్‌ఎంఎస్‌లో రాష్ట్రంలోనే జిల్లా ప్రధమం
  • ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన అధికారుల‌కు బంగారు ప‌త‌కాలు
ఏపీలో ఆధార్‌ అనుసంధానం తరహాలో భూధార్‌ 

రాష్ట్రంలో ఆధార్‌ అనుసంధానం తరహాలో భూధార్‌ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతెలిపారు. అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో భూధార్‌ అమలు చేస్తామని చెప్పారు. సోమవారం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్)లో విధానం అమలుపై  చంద్ర‌బాబు ఆర్ధిక శాఖ అధికారులతో కలసి 13 జిల్లాల‌ కలెక్టర్లతో పాటు క్షేత్రస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం, జాయింటు కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఇతర అధికారులతో కలసి విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్సులో పాల్గొన్నారు.  విజయవాడలో సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రారంభించిన సందర్భంగా డిస్పర్‌సింగ్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పూర్తి పారదర్శక పాలనకు సీఎఫ్‌ఎంఎస్‌ ఎంతో ఉపయోగకరమని  అన్నారు.

 ఈ విధానంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలో 93.16 శాతంతో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వీడియో కాన్ఫరెన్సు (వీసీ)లో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 5,252 కార్యాలయాలకుగాను 4,893 కార్యాలయాలు పూర్తిగా సిఎఫ్‌ఎంఎస్ పరిధిలోకి వచ్చాయన్నారు. మిగిలిన 359 కార్యాలయాలు సిఎఫ్‌ఎంఎస్‌లో చేర్చాల్సి ఉంద‌న్నారు. త్వరలో వీటిని పూర్తి చేసి నూటికి నూరు శాతం జిల్లాలో సిఎఫ్‌ఎంఎస్ విధానం అమలుపర్చనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం, మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కరంలో రెవెన్యూ, సివిల్ సప్లయిస్ శాఖల పని తీరు మెరుగ్గా ఉందని ప్రసంశించారు. హౌసింగ్, ఎపి ట్రాన్సుకో పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. జిల్లాలో రేషన్, పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పధకాల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ శాఖల్లో గుర్తించిన కీఫ్ ఫెర్ఫార్మెన్సు ఇండికేటర్ (కెపిఐ) పూర్తి స్థాయిలో అమలుపర్చాలన్నారు. ప్రతి ఆసుపత్రిలో అభివృద్ధి క‌మిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సిఇవో జడ్‌పి త్రాగునీరు విషయంలో అప్రమత్తంగా ఉంటూ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. జిల్లాను బాలకార్మిర రహితంగా తీర్చిదిద్దాల‌ని పిడిఎన్‌సిఎల్‌పికి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు అందించే బ్యాంకు రుణాలకు ఈ నెల 4వ తేది వరకు గడుపు ఉన్నందున నూటికి నూరు శాతం ఈ ప్రక్రియను వేగ‌వంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి సాధించడం ద్వారా 39 శాతం లేబర్ బడ్జెట్ నిధులు సాధించుకోవడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ విధంగా నిధులు పెంచుకోవడం ఇదే ప్రధమమని ప్రతిభ కనపర్చిన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేష్‌ను బంగారు పతకంతో సత్కరించనున్నట్లు అదేవిధంగా జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు, తాగునీరు అందించడంలో సఫలీకృతమై రైతుల ప్రసంశలు పొందిన జాయింటు కలెక్టర్-2 పి.బాబూరావును బంగారు పతకంతో సత్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాలో రెవెన్యూ విభాగం ద్వారా రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో ప్రతిభ కనపర్చిన జిల్లా రెవెన్యూ అధికారి బి.ఆర్.అంబేద్కర్‌కు బంగారు పతకంతో సత్కరించనున్న‌ట్లు చెప్పారు. బ్యాంకు లింకేజి రుణాలు అందించడంలో సహకరించిన ఏడుగురు బ్యాంకు మేనేజర్లకు ఎల్‌డిఎం వెంకటేశ్వర్లరెడ్డికి, డిఆర్‌డిఎ పీడీ చంద్రశేఖర్‌రాజుల‌ను బంగారు పతకాలతో సత్కరించనున్నామన్నారు. అదేవిధంగా ప్రతిభ కనపర్చిన ఆర్‌అండ్‌బి ఎస్.ఇ.శేషుకుమార్, డిటిడిసి మీరాప్రసాద్‌లను సత్కరించనున్నట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు.
 

Related Posts