YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

తీహార్ జైలు వద్ద స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు

తీహార్ జైలు వద్ద స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు

తీహార్ జైలు వద్ద స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు
-‘నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం ఏమీ మారదు: సనా
న్యూఢిల్లీ, మార్చి 20 
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు వద్ద స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిర్భయ వర్థిల్లాలి, భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కొందరు జాతీయ జెండా ప్రదర్శించారు.  కాగా, నిర్భయ దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్‌ సెంట్రల్‌ జైలులోని జైలు నెంబర్‌ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇక జైలు వద్దకు చేరుకున్న వారిలో సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు. ‘నిర్భయకు న్యాయం జరిగింది. మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలి’ అనే పోస్టర్‌ను ఆమె ప్రదర్శించారు. నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.కష్టతరమైన యుద్ధంలో విజయం సాధించామని నిర్భయ కుంటుంబం సన్నిహితుడు అకాశ్‌ దీప్‌ అన్నారు. ఉరి శిక్ష నిర్ణయం, అమలు.. మంచిదే.. కానీ, శిక్ష అమలు ఇంతలా ఆలస్యం కాకుండా... ముందే జరగాల్సిందని దివ్యా ధావన్‌ అనే మహిళా అన్నారు.  ‘నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం  ఏమీ మారదు. కానీ, నిర్భయకు న్యాయం జరిగింది. సంతోషం’అని సనా అనే యువతి తెలిపారు. ఇక ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్‌ జైలులో ఒకేసారి నలుగురికి ఉరితీయయం ఇదే తొలిసారి. తీహార్‌ జైలు 16 వేల మంది ఖైదీలకు కాగారారం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉరి అమలు నేపథ్యంలో జైలు వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుద్టిమైన భద్రత ఏర్పాటు చేశారు.ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌ జలాద్‌ వారిని ఉరితీశారు. జైలు నెంబర్‌ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.

Related Posts