YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నిమ్మగడ్డ వ్యవహారంతో మంత్రులు హ్యాపీ

 నిమ్మగడ్డ వ్యవహారంతో మంత్రులు హ్యాపీ

 నిమ్మగడ్డ వ్యవహారంతో మంత్రులు హ్యాపీ
విజయవాడ, మార్చి 21
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కొంత ఊపిరి పీల్చుకున్నట్లే కన్పిస్తుంది. పైకి గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలోపల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంపై వారు ఆనంద పడుతున్నారు. ఎన్నికల్లో ఒకవేళ ఓటమి ఎదురైతే ఆ తప్పిదం నిమ్మగడ్డపైకి నెట్టేసుందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఆర్కే రోజా లాంటి వాళ్లు కూడా వాయిదాను సమర్థించారు. తర్వాత నాయకత్వం లైన్ తెలిసి నాలుక కరుచుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను బట్టే మంత్రి పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. నేరుగా రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.దీన్నిబట్టి జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎంత సీరియస్ గా ఉందీ చెప్పకనే తెలుస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎలాగోలా నెట్టుకురావచ్చు. చాలా వరకూ ఏకగ్రీవం చేసుకునే దిశగా మంత్రులు అనేక చోట్ల ప్రయత్నించారు. భయపెట్టో, బతిమాలో ఏకగ్రీవాలు చేసి కొంత కుదుట పడ్డారు. ఎంపీటీసీీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఎటువంటి ఇబ్బందులు మంత్రులకు తలెత్తలేదు. జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా సులువగానే తమ పరమయిపోతుందని వారికి తెలుసు.ఇక పట్టణ ప్రాంతాల్లోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు కన్పిస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. ఇక్కడ ప్రజల నాడి ప్రభుత్వంపై ఎలా ఉందో తెలియక తికమక పడుతున్నారు. రాజధాని మార్పు, మండలి రద్దు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు వంటివి పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశముంది. దీంతో మంత్రుల్లో మున్సిపల్ ఎన్నికల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడాన్ని వారు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఆనందంగా ఉన్నారు. ఏదైనా మున్సిపాలిటీలో రివర్స్ ఫలితాలొస్తే నిమ్మగడ్డపై తోసేయొచ్చన్నది కొందరి మంత్రుల ఆలోచనగా కన్పిస్తుంది. ఎన్నికల వాయిదా కారణంగానే ఓటమిపాలయ్యామని అధినేతకు నచ్చ చెప్పుకునే వీలుంటుందన్నది వారి అభిప్రాయం.

Related Posts