YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 బడ్జెట్ సమావేశాలకు కసరత్తు

 బడ్జెట్ సమావేశాలకు కసరత్తు

 బడ్జెట్ సమావేశాలకు కసరత్తు
విజయవాడ, మార్చి 21
ఏపీ అసెబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 27న గవర్నర్ ప్రసంగం.. 28న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. 28 లేదా 29న బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల వ్యయాల నిమిత్తం అసెంబ్లీ అనుమతి పొందేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో.. ఈ సమావేశాలను నాలుగైదు రోజుల్లో ముగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇవాళో, రేపో అధికారికంగా ప్రకటన రావొచ్చు.మరోవైపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ కసరత్తు చేస్తోంది. సోమవారం వైఎస్సార్‌సీపీశాసనసభాపక్షసమావేశం నిర్వహించేందకు సిద్ధమయ్యారు. రాజ్యసభ ఎన్నికలో పోలింగ్, అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా ఈ సమావేశంల చర్చించనున్నారు. అదే రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ నలుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి ఏయే ఎమ్మెల్యే ఓటేయాలనే అంశంపై టీమ్‌లుగా ఏర్పాటు చేయనున్నారు. నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి 38 మంది చొప్పున ఎమ్మెల్యేలు.. నాలుగో అభ్యర్థికి 37మంది ఓటేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. టీడీపీ నుంచి వెళ్లి జగన్‌కు జైకొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటు సంగతి ఏంటనే చర్చ మొదలైంది. టీడీపీ విప్ జారీ చేసే అవకాశం ఉండటంతో.. విప్‌ను ధిక్కరిస్తారా.. పోలింగ్‌కు దూరంగా ఉంటారా అన్నది చూడాలి. అలాగే టీడీపీ నుంచి ఐదో అభ్యర్థి బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.

Related Posts