YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీ సర్కార్

 మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీ సర్కార్

 మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీ సర్కార్
భోపాల్, మార్చి 21
శివరాజ్ సింగ్ చౌహాన్… నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీ అయిపోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్ నాధ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేయడంతో బీజేపీ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం శివరాజ్ సింగ్ వైపు మొగ్గు చూపుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. బీజేపీ మధ్యప్రదేశ్ లో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ దాదాపు పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.2018 లనూ బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేవు. మృదుస్వభావి. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కావడం విశేషం. అయితే 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో గత ఎన్నికల్లో బీజేపీ 109 సీట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు 114 స్థానాలు మాత్రమే దక్కాయి. అంటే నైతికంగా శివరాజ్ సింగ్ పదిహేను నెలల క్రితమే విజయం సాధించారని చెప్పకతప్పదు.అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ పదిహేను నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దాదాపు పదమూడేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చౌహాన్ పై గత ఎన్నికల్లో వ్యతిరరేకత కన్పించ లేదు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులపైనే వ్యతిరేకత కన్పించడాన్ని అధిష్టానం సయితం గుర్తించింది. ఏడుసీట్ల దూరంలోనే అధికారం అప్పట్లో మిస్ అయింది. లేకుంటే నాలుగోసారి పదిహేను నెలల క్రితమే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేసేవారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో పనిచేేసేందుకే సమ్మతి తెలిపారు. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లోనూ అధికారంలో లేకపోయినా చౌహాన్ కాంగ్రెస్ ను ఒంటిచేత్తో మట్టికరిపించ గలిగారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే బీజేపీలోనే రికార్డు నెలకొల్పినట్లవుతారు. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2003 నుంచి 2018 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీలో అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రమే. నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే రమణ్ సింగ్ రికార్డును అధిగమించుతారు.

Related Posts