YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపలో బీజేపీ వర్సెస్ వైసీపీ

కడపలో బీజేపీ వర్సెస్ వైసీపీ

కడపలో బీజేపీ వర్సెస్ వైసీపీ
కడప, మార్చి 23
జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడూ అంతే. నిరంతరం నరాలు తెగిపోవాల్సిందే. నిత్యం టెన్షనే. ఇద్దరు నేతలు కలిసినా ఫలితం లేదు. ఇటీవల జమ్మలమడుగులో సీనియర్ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన సుధీర్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ కలిస్తే వార్ వన్ సైడ్ అయిపోతుందనుకున్నారు. జమ్మలమడుగు లో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారు.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరి వారం రోజులు గడుస్తున్నా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలవలేదు. సుధీర్ రెడ్డి కూడా రామసుబ్బారెడ్డి చేరికపై అసహనంతో ఉన్నారు. అందుకే ఇద్దరు నేతలు ఒకరినొకరు కలుసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై యాభై వేల మెజారిటీతో గెలుపొందారు. దీంతో రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉండలేక వైసీపీలో చేరారు. ఇద్దరుకలసి పనిచేసుకోవాలని జగన్ కూడా సూచించారు.ఇద్దరు ఒక్కటైతే ఎన్నికలన్నీ ఏకపక్షంగా జరుగుతాయని భావించారు. అయితే రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డిలు ఇద్దరు ఎడమొహం, పెడమొహంగా ఉంటుండటంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. అభ్యర్థులకు కూడా ఎవరి వద్దకు వెళ్లాలన్న సమస్య పట్టుకుంది. వైసీపీలో చేరిన వెంటనే రామసుబ్బారెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించాలని నిర్ణయించారు. అయితే ఆదినారాయణరెడ్డి ఎంట్రీతో 90 శాతం స్థానాల్లో జమ్మలమడుగులో తీవ్ర పోటీ ఏర్పడింది.ఆదినారాయణరెడ్డి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనుకున్నారు. ఇప్పటి వరకూ జమ్మలమడుగుకు దూరంగా ఉన్న ఆదినారాయణరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల వేళ తన అనుచరులను బరిలోకి దింపారు. ఇప్పుడు జమ్మలమడుగులో 90 శాతం వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంది. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికతో టీడీపీ నామినేషన్లు కూడా వేయలేకపోయింది. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. మొత్తం మీద వైసీపీలో ఇద్దరి నేతల మధ్య విభేదాలు ముదిరిపోతుంటే ఆదినారాయణరెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.

Related Posts