YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు గుంపులుగా గుమికూడకండి

ప్రజలు గుంపులుగా గుమికూడకండి

ప్రజలు గుంపులుగా గుమికూడకండి
-సామాజిక దూరం పాటించండి -ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకురాకండి
-కరోనా వైరస్ కట్టడి స్వచ్ఛందంగా ప్రజలందరూ సహకరించండి-జిల్లా కలెక్టర్
చిత్తూరు, మార్చి 24,
ప్రజలందరూ సామాజిక బాధ్యత తో సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 8 గం. ల నుండే జిల్లా కలెక్టర్ చిత్తూరు పట్టణం లో సుడిగాలి పర్యటన చేసి పారిశుధ్య నిర్వహణ మరియు కరోనా కట్టడి కి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు లో ఉన్నందున ఆ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటన లో భాగంగా వేలూరు రోడ్ లో గల రైతు బజార్ చేరుకుని అక్కడ పరిస్థితులు పరిశీలిస్తూ రైతు బజార్ కు వచ్చే ప్రజలు గుంపులు గుంపులు గా కూరగాయల నిమిత్తం రాకుండా 10 మందికి మించకుండా వచ్చిన ప్రజల మధ్య కనీసం 3 అడుగులు దూరం ఉండేలా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, రైతు బజార్ నందు పారిశుధ్యం ను మెరుగ్గా నిర్వహించాలని ఎస్టేట్ అధికారి ని ఆదేశించారు. అనంతరం గిరింపేట్ లో గల నారాయణ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాల సిబ్బంది విధులకు హాజరు కావడం పై ఆగ్రహం వ్యక్తం చేసి పాఠశాలను తాత్కాలికంగా మూసివేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చిత్తూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఓబులేశు, చిత్తూరు తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Related Posts