YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కమల సేన ఫ్యూచర్ అంతేనా

 కమల సేన ఫ్యూచర్ అంతేనా

 కమల సేన ఫ్యూచర్ అంతేనా
విజయవాడ, మార్చి 26
ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం అంటూ ముందుకు వచ్చిన బీజేపీ జనసేనలకు ఆదిలోనే సీన్ ఏంటో బాగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు ఈ రెండు పార్టీలు కలిపి  దాదాపుగా నాలుగువేల వరకూ మాత్రమే వేయగలిగాయి. అదే సమయంలో అధికార వైసీపీ 23 వేలకు పైగా నామినేషన్లు వేస్తే టీడీపీ 18 వేల దగ్గర ఉంది. అంటే బీజేపీ, జన‌సేన మొత్తం సీట్లలో సగానికి  కూడా నామినేషన్లు వేయలేకపోయాయి. దాంతో ఈ పార్టీల లోకల్ ఫైట్ ఏంటో ముందే తేలిపోయింది.మరో వైపు చూసుకుంటే ఢిల్లీలో బీజేపీకి హై కమాండ్ ఉంది. వారికి ఏపీ అంటే ఎపుడూ పెద్దగా ఆశలు  లేవు. అప్పట్లో వెంకయ్యనాయుడు అనుసంధానంగా ఉండి ఏపీలో కొంత వరకూ కధ నడిపించేవారు. ఇపుడు ఆయన లేకపోవడం, మిగిలిన నాయకులకు ఢిల్లీతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండడంతో పల్లె ఎన్నికలపైన ఢిల్లీకి ఏమీ ఆసక్తి లేకుండా పోయింది. మరో వైపు మోడీ వేవ్ దేశవ్యాప్తంగా రెండు సార్లు గట్టిగా వీచినా కూడా ఏపీలో బీజేపీ ఎత్తిగిల్లలేదు. దాంతో హస్తిన కాషాయం నేతలు ఏపీని అసలు  పట్టించుకోవడంలేదంటున్నారు.ఢిల్లీ పెద్దలకు వారి రాజకీయాలు వారివిగా ఉన్నాయి. అందుకే ఇక్కడ వైసీపీతో తెర వెనక దోస్తీ చేస్తూ తెర ముందు మాత్రం ఏపీ నాయకులను వదులుతున్నారు. వీరికి బలం  లేదు, పైనున్న అధినాయకత్వం సంపూర్ణ మద్దతు లేక కిందా మీదా అవుతున్నారు. నిజానికి ఏపీలో బలమైన నాయకులు బీజేపీకి లేకపోవడం వల్లనే కేంద్రం కూడా చిన్న చూపు చూస్తోందని  అంటున్నారు. ఇక్కడ నాయకులు జగన్ ని తిట్టినా ఢిల్లీ పెద్దలు మాత్రం కిక్కురుమనరు, దాంతో ఏపీ బీజేపీ నేతలు ఫూల్స్ గా మారిపోతున్నారు. మొత్తం రాజకీయ చదరంగంలో తమ పార్టీ పెద్దలే తమను  ఇలా రోడ్డు మీద నిలబెడుతున్నారని ఏపీలోని కమలధారులు ఆక్రోసిస్తున్నారు.చిత్రమేంటంటే ఏపీ బీజేపీని లేపడం కేంద్ర పెద్దల వల్లనే కాలేదు. ఎన్నో ప్రయోగాలు చేసినా కూడా ఏపీలో కమల వికాసం  జరగలేదు. అటువంటిది సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో జత కట్టి బతికించుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు ఆ పార్టీ నుంచే వస్తున్నాయి. ఇక పవన్ జనసేనకు పెద్దగా బలం లేదన్నది సాధారణ ఎన్నికల్లో  తేలిపోయింది. ఆయన కూడా తన పార్టీని లేపమంటూ బీజేపీ వైపు చూస్తున్నాడు. ఇలా రెండు బలహీన పార్టీలు జట్టు కట్టి బలమైన బంధం అంటూ మీడియాకు ఫోజులు ఇస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో సీన్ వేరేలా ఉందని అంటున్నారు. అంటున్నారు. అందుకే రెండు పార్టీలు తమకు బాగా బలం ఉందని చెప్పుకుంటున్న విశాఖలో కూడా సగానికి పైగా ఎంపీటీసీలకు అసలు నామినేషన్లే వేయని స్థితి ఉందని  అంటున్నారు. మొత్తానికి ఏపీలో తృతీయ కూటమి ఆదిలోనే ఇలా చేతులెత్తేస్తోందని అంటున్నారు

Related Posts