YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మేకపాటికి తగ్గుతున్న ప్రియార్టీ

 మేకపాటికి తగ్గుతున్న ప్రియార్టీ

 మేకపాటికి తగ్గుతున్న ప్రియార్టీ
నెల్లూరు, మార్చి 27
మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఒకరకంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ వెన్నంటి నడిచిన అతి కొద్దిమందిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా మేకపాటి కుటుంబం జగన్ ను నమ్ముకునే ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీకి మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయిన నాటి నుంచే మేకపాటి కుటుంబానికి కొంత జిల్లాలో ప్రయారిటీ తగ్గిందనే చెప్పాలి. విజయసాయిరెడ్డి సిఫార్సుతో వేమిరెడ్డికి ఎన్నికలకు ముందే రాజ్యసభ పదవి ఇచ్చారు. దీంతో వేమిరెడ్డి కూడా పార్టీ విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దీంతో పాటు తమకు శత్రువుగా భావించే ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చారు. ఇది ఎంతమాత్రం మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అయినా పార్టీ కోసం ఆయన తలవొంచుకు వెళ్లారంటారు.కానీ ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి మంచి ప్రయారిటీ ఇచ్చారు జగన్. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలను ఆ కుటుంబానికే కేటాయించారు. కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాత్రం నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా జగన్ పక్కన పెట్టారు. దీనికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన టీడీపీ నుంచి రావడంతో ఆయనకే జగన్ ప్రయారిటీ ఇచ్చారు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ ఇస్తారని అందరూ భావించారు.రాజ్యసభ సీటూ మేకపాటి రాజమోహన్ రెడ్డికి దక్కలేదు. నాలుగింటిలో రెండు బీసీలకు, ఒకటి అయోధ్య రామిరెడ్డికి, మరొకటి నత్వానికి ఇచ్చారు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇవ్వలేదు. తనకు రాజ్యసభ పదవి మాత్రమే కావాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. నిజానికి నెల్లూరు జిల్లా నుంచి ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావుకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయనకు ఇస్తే మేకపాటి మరింత హర్ట్ అవుతారని మస్తాన్ రావును జగన్ పక్కన పెట్టారన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి. మరి పెద్దాయన పదేళ్ల పాటు సిన్సియర్ గా పడిన శ్రమకు ఎప్పుడు గుర్తింపు లభిస్తుందో చూడాలి.

Related Posts