YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇక ఇంటి నుంచే బాబు

ఇక ఇంటి నుంచే బాబు

ఇక ఇంటి నుంచే బాబు
హైద్రాబాద్, మార్చి 28
డీపీ అధినేత చంద్రబాబునాయుడు గత వారం రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారు. గత శుక్రవారం అమరావతికి చేరుకున్న చంద్రబాబు లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సొంత ఇంట్లోనే ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజు టీడీపీ నేతలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించడం, సరిహద్దులు మూసివేయడంతో పాటు ఇప్పుడు విజయవాడలో ఉండటం క్షేమకరం కాదని భావించి చంద్రబాబు హౌస్ క్వారంటైన్ లోనే ఉన్నారు.అయితే ఇదే సమయంలో ఎక్కువ మంది టీడీపీ నేతలు హైదరాబాద్ లోనే ఉన్నట్లు చంద్రబాబుకు సమాచారం అందడంతో ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యనేతలు సయితం నియోజకవర్గాలను వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉండటమేంటని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఎక్కువ మంది టీడీపీ నేతలు గత పది నెలలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మాజీ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు సయితం హైదరాబాద్ లోనే ఉంటూ వస్తున్నారు.ఏపీలో పెద్దగా పనిలేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఇక అక్కడ పనిలేదని తెలిసిన టీడీపీ నేతలు నేరుగా హైదరాబాద్ కు పది రోజుల క్రితమే చేరుకున్నారు. అనేక మందికి హైదరాబాద్ లో వ్యాపారసంస్థలు ఉండటంతో ఇక్కడే ఉండిపోయారు. అయితే గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కొందరు నేతలయితే తాము ఇక్కడే ఇరుక్కుపోయామని, త్వరలోనే నియోజకవర్గాలకు వెళతామని చంద్రబాబుకు వివరణఇచ్చుకుంటున్నారట.కానీ కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎవరూ అందబాటులో లేకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అండగా ఉండాల్సిన నేతలు అందుబాటులో లేకపోతే ఎలా? అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు కూడా హైదరాబాద్ లోనే ఉండి పార్టీ నేతలను మానిటరింగ్ చేస్తున్నారు.

Related Posts