YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాలి

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాలి

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాలి  కమిషనర్ భాస్కర్

చిత్తూరు, ఏప్రిల్ 8 కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ కె.భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో వెలగపూడి నుండి మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి శ్యాంపుల్ కలెక్షన్, యం.ఐ.యస్. యాప్ లో అప్లోడ్ చేయు విధానం పై వివిధ జిల్లాలలోని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖాధికారులు, కోవిడ్ -19 క్వారంటైన్ స్పెషల్ ఆఫీసర్లు, కోవిడ్ ఆసుపత్రుల స్పెషల్ ఆఫీసర్లు, సూపరిండెంట్లు, ల్యాబ్ ఇంచార్జ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మాట్లాడుతూ వైధ్య అధికారులు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారి యొక్క వివరములను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి క్వారంటైన్ సెంటర్ కు పంపించాలన్నారు. క్వారంటైన్ సెంటర్ లోని వ్యక్తులకు వ్యాధి లక్షణాలు తీవ్రమైనచో అట్టి వారి యొక్క వివరాలను ఆన్ లైన్ ద్వారా ఆసుపత్రి ఐసోలేషన్ కు పంపాలని తెలిపారు. వైద్య పరీక్షలు అవసరమైన వారికి శ్యాంపుల్ నమూనాలు తీసి శ్యాంపుల్ టెస్ట్ కొరకు ల్యాబ్ కు వైధ్యాదికారులు పంపించాలని అలాగే రోగి యొక్క వివరములను ఆన్ లైన్ లో ఆసుపత్రి లాగిన్ లో అప్లోడ్ చేయాలన్నారు. ల్యాబ్ ఇంచార్జ్ లాగిన్ లో ల్యాబ్ టెక్నీషియన్లు రోగుల యొక్క శ్యాంపుల్ వివరాలను ఆన్ లైన్ లో చూసుకొని పరీక్షలు నిర్వహించాలని అలాగే రిజల్ట్స్ ను ఆన్ లైన్ లో నింపి ప్రింట్ తీసి సంతకం చేసి తిరిగి ఆన్ లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు. ల్యాబ్ ఇంచార్జ్ లాగిన్ లో అప్లోడ్ చేయబడిన రిజల్ట్స్ ఆసుపత్రి లాగిన్ లో, క్వారంటైన్ సెంటర్ లాగిన్ లో అలాగే పి.హెచ్.సి లాగిన్ లో డిస్ ప్లే అవుతాయని తద్వారా రోగికి వైద్య చికిత్సలు, రోగి ఉన్న ప్రాంతంలో ఇంటింటి సర్వే చేసి ఇంకా ఎవరైనా వ్యాధి లక్షణాలు ఉన్నచో గుర్తించుటకు వీలవుతుందని తెలిపారు. ఆసుపత్రి అధికారులు శ్యాంపుల్ కలెక్షన్ ను త్వరిత గతిన చేసి టెస్టింగ్ ల్యాబ్ కు పంపాలని, ల్యాబ్ ఇంచార్జ్ లు వెంటనే పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెట్.పి.సి.ఇ.ఓ కోదండరామి రెడ్డి, పి.ఓ.డి.టి.టి.డాక్టర్ రమాదేవి, డి.యస్.ఓ డాక్టర్ సుదర్శన్, డి.పి.యం.ఓ శ్రీనివాసులు, డెమో నిర్మల, తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts