YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంటైన్మెంట్ స్ట్రాటజీ ని అమలు చేస్తున్నాం

Highlights

కంటైన్మెంట్ స్ట్రాటజీ ని అమలు చేస్తున్నాం
 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దించాం
 వేగవంతంగా సూక్ష్మ స్థాయిలో వివరాల సేకరణ
 జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం ఏప్రిల్ 8
జిల్లాలో  నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి కంటైన్మెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా  కంటైన్మెంట్ స్ట్రాటజీ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో  కోవిడ్ 19 పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటైన్మెంట్ స్ట్రాటజీ టీంల ద్వారా సూక్ష్మ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించిన కాంటాక్ట్ ల వివరాలను వేగవంతంగా సేకరించాలని ఆదేశించారు. ఒక్కో కంటైన్మెంట్ స్ట్రాటజీ టీంలో ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు ఎంపిహెచ్ వోలు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఎస్సై, ఒక వీఆర్వో లతో ఆరుగురు సభ్యులతో కూడిన 7 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.  జిల్లా లో  కొత్తగా నమోదైన 7 కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించిన వివరాలను, వారి కుటుంబ సభ్యుల వివరాలను, వారు ఎక్కడెక్కడ తిరిగారు, సూపర్ మార్కెట్ లు, టీ స్టాల్స్, ఇతర బయట ప్రాంతాల్లో ఎక్కడకు వెళ్లి వచ్చారు అనే వివరాలను ఈ 7 కంటైన్మెంట్ స్ట్రాటజీ టీంలు వేగంగా గుర్తించాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరితో ఎక్కువ సమయం మాట్లాడారు, ఎవరితో తక్కువ సమయం గడిపారు అనే వివరాలను తెలుసుకోవాలన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కలిగిన వ్యక్తులు ఎటువంటి భయాందోళనలకు లోనుకారాదని, ధైర్యంగా ఉండాలని, 14 రోజుల హోమ్ ఐసోలేషన్ పూర్తి చేసుకోవాలని, డాక్టర్లు ఇచ్చిన మందులను వాడుతూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. పాజిటివ్ కలిగిన వ్యక్తులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వారు ఎవరెవరితో కలిశారు, ఎక్కడ తిరిగారు అనే వివరాలను పూర్తిస్థాయిలో తెలియజేయాలని కోరారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న  నలుగురికి, హిందూ పురంలో 2, కళ్యాణదుర్గంలో ఒకటి  కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు, వారు కలిసిన వ్యక్తులు, వారు వెళ్లి వచ్చిన పరిసరాలలో కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు కంటైన్మెంట్ స్ట్రాటజీ టీంలు వేగంగా పని చేయాలన్నారు.  ఈ సమావేశంలో ఎస్ పి సత్య ఏసుబాబు, జెసి ఢిల్లీ రావు, జెసి2 రామ్మూర్తి, డీఎంహెచ్ఓ అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

కంటైన్మెంట్ స్ట్రాటజీ ని అమలు చేస్తున్నాం

Related Posts